
రాముడికి సీత ఫిక్స్ ఆదిపురుష్ హీరొయిన్ ఈవిడేనా?
బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరో మూడు పెద్ద ప్రాజెక్ట్ లు ఒప్పుకున్నారు. అందులో ఆదిపురుష్ ఒకటి. తాజాగా ఈ సినిమా 2022 లో రిలీజ్ అవ్వనుందని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు అన్న విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తను నటించగలడా లేదా అన్న విషయం పక్కన పెడితే, అసలు ఎలా నటిస్తాడు అన్నది ప్రశ్నగా మారింది. కథ ఏంటో కూడా ఊహలకు అందకుండా పోయింది.
రాముడికి సీత ఫిక్స్ ఆదిపురుష్ హీరొయిన్ ఈవిడేనా?
అందరూ ఎక్సైట్ అయ్యేలా సినిమా ఉంటుందని తెలిసింది. అయితే రాముడికి సీత కావలి కాబట్టి ఆ సీత క్రితిసనన్ అని ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. గతంలో క్రితిసనన్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో నేనొక్కడినే, యువ సామ్రాట్ నాగ చైతన్య తో దోచేయ్ సినిమాలు చేసారు. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వకపోవడంతో బాలీవుడ్ లో హీరో పంతి సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత దిల్వాలే, లూకా చుప్పి, హౌస్ ఫుల్ 4 లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు క్రితిసనన్. ఈ సినిమాలో సీత పాత్రకి సరిపోయేది క్రితిసనన్ అని ఆల్రెడీ తనని కాంటాక్ట్ చేసారని తెలుస్తుంది. మరి ఇది నిజమేనా అన్న సంగతి తెలియాలంటే ఆఫిషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చెయ్యవలసిందే…