నటుడిగా మారనున్న సీనియర్ దర్శకుడు…

దర్శక దిగ్గజం కే రాగవేంద్ర రావు వందకు పైగా సినిమాలు చేసారు అని అందరికి తెలిసిందే. తన యాభై ఏళ్ళ కెరీర్ లో తను దర్శకత్వం చేసిన సినిమాల్లో గాని, వేరే సినిమాల్లో గాని కూడా తను నటించలేదు. కనీసం ఒక చిన్న పాత్ర కూడా చెయ్యలేదు. అయితే ఇప్పుడు మొదటిసారిగా ఆయన నటించబోతున్నారు. తనికెళ భరణి డైరెక్షన్ లో నటించనున్నారు.
నటుడిగా మారనున్న సీనియర్ దర్శకుడు…
ఈ సినిమాలో, సమంత అక్కినేని, రమ్య కృష్ణ, శ్రియ లతో పాటు నలుగూ కొత్త వాళ్ళు లీడ్ రోల్స్ లో నటించనున్నారు. అయితే రాఘవేంద్ర రావు సినిమా మొత్తం ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు. ఈ దర్శక దిగ్గజం మొదటిసారి నటిస్తున్నారు కాబట్టి ఎలా నటిస్తాడు అన్న క్వశ్చన్ అందరిలో ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తను 78వ వయసులో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కబోతుంది అని తెలిసింది. మరి ఆఫిషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.
0 Comments