
థియేటర్స్ లో రిలీజ్ అవ్వనున్న సోలో బ్రతుకే సో బెటర్
మెగా ఫ్యామిలీ అల్లుడిగా పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో పరిచయమై, సుప్రీమ్ హీరో గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, లాంటి సినిమాలతో మంచి విజయం అందుకున్నారు. అయితే మధ్యలో కొన్ని ఫ్లాప్ లు వచ్చినా కూడా చిత్రలహరి సినిమాతో మళ్ళి పట్టలేక్కడు ధరమ్ తేజ్.
థియేటర్స్ లో రిలీజ్ అవ్వనున్న సోలో బ్రతుకే సో బెటర్
దాని తర్వాత తన కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ చేసారు ఈ సినిమా టీం. 25 డిసెంబర్, అనగా క్రిస్మస్ రోజు రిలీజ్ చేస్తామని ఫిక్స్ చేసారు. దీంతో సంక్రాంతి తర్వాత ఆగిపోయిన కలెక్షన్స్ మళ్ళి క్రిస్మస్ తో కళకళలాడుతాయని తెలుస్తుంది. ఈ సినిమాని సుబ్బు డైరెక్ట్ చెయ్యగా, థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇష్మార్ట్ శంకర్, డిస్కో రాజ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నభ నటేష్ ఈ సినిమాలో హీరొయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాటలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి కాబట్టి సాయి ధరమ్ తేజ్ ఈసారి కూడా హిట్ కొడుతాడని అంటున్నారు కొందరు.
