1 C
New York
January 27, 2021
CINEMA RASCALS
Entertainment News Latest Movies reviews Trending Now

ఆ హిందీ సినిమా రీమేక్ లో త్రిష!!!!

ఆ హిందీ సినిమా రీమేక్ లో త్రిష!!!!

ఆ హిందీ సినిమా రీమేక్ లో త్రిష!!!!

త్రిష తెలుగులో వర్షం సినిమా తో మంచి స్టార్ డమ్ తెచ్చుకుని చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లాంటి యువ హీరోలతో కూడా నటించిన ఈ అమ్మడు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దాదాపుగా రెండు దశబ్దాలుగా నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే ఆమె కెరీర్ లో కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పుడు త్రిష కెరీర్ ఇక అయిపోయింది అని అందరూ అనుకుంటున్న ప్రతి సారి కూడా ఆమెకు అనూహ్యంగా ఏదో ఒక మంచి సక్సెస్ రావడం తన నటనకు మంచి గుర్తింపు రావడంతో మళ్లీ అక్కడి నుంచి కొన్నాళ్ల పాటు ఆమె కెరీర్ కంటిన్యూ చేయడం ఇలా ఎన్నో సార్లు జరిగింది. మొన్న తమిళ్ లో వచ్చిన 96 సినిమా కూడా ఆమె కెరీర్ కు మళ్లీ ఒక బూస్ట్ ఇచ్చింది అని చెప్పవచ్చు.అయితే తన కెరీర్లో ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించిన త్రిష ఇప్పుడు తాజాగా మరో రీమేక్ సినిమాకు కమిట్ అయ్యింది. దాదాపు అయిదు సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో దీపికా పదుకొనే ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో వచ్చి వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టి సంచలన విజయం సాధించిన పీకు మూవీ రీమేక్ లో త్రిష ఇప్పుడు నటించబోతుందనే న్యూస్ సినిమా సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది. అయితే ఈ రీమేక్ ను తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం వస్తుంది కానీ దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఆ హిందీ సినిమా రీమేక్ లో త్రిష!!!!

ఇక పీకు మూవీలో దీపిక పదుకునే పోషించిన పాత్రలో త్రిష నటించబోతుంది నిజానికి సినిమా కథ పెద్దగా ఉండకపోయినా కూడా స్క్రీన్ ప్లే అన్నది మ్యాజిక్ చేసింది అని చెప్పవచ్చు. ఇక పీకు సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అయినా అమితాబచ్చన్ ఒక కీలక పాత్రలో కనిపించారు మరి అంత పెద్ద హీరో నటించిన ఆ పాత్రను దాని రీమేక్ లో ఎవరు చేస్తారు అనేది చూడాలి. సినిమాలో దీపికా పదుకొనే చేసిన ఛాలెంజింగ్ రోల్ చేయడానికి త్రిష అయితే ముందుకు వచ్చింది కానీ మరి బచ్చన్ సాబ్ పోషించిన పాత్ర కూడా అంతకు మించి ఛాలెంజింగ్ గా ఉంటుంది.అయితే సినిమాను ఎలాగో తెలుగు మరియు తమిళ్ లో కలిపి రీమిక్స్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి తెలుగు మరియు తమిళంలో బాగా పాపులర్ అయిన నటుడిని తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం కొంతమంది
సీనియర్ హీరోల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి అనే న్యూస్ లు వస్తున్నాయి. మరి వారిలో ఎవరు ఓకే అవుతారో అనేది చూడాలి. తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన త్రిష ఈ సినిమాతో మరోసారి నటిగా తనను తాను నిరూపించుకోవడంతో పాటు ఖచ్చితంగా ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తుందనే నమ్మకం ఆమె అభిమానులతో పాటు అటు సినీ ప్రేక్షకుల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఆ మధ్య ఎంగేజ్మెంట్ తర్వాత తన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న త్రిష సినిమాల్లో కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఈ సినిమా తర్వాత త్రిష మరో రెండేళ్ల పాటు అయినా తన కెరీర్ ను కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి. వచ్చే ఏడాది వరకు అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Related posts

CHARMING PICS OF AKHIL AKKINENI

cinemarascals

Stunner in Black PARVATI Looks Gorgeous

cinemarascals

LOVELY PICS OF ISHWARYA MENON

cinemarascals

Leave a Comment