అటు మహేష్ బాబు ఇటు అల్లు అర్జున్ మధ్యలో సుకుమార్!!!


Mahesh Bbau in 1 Movie
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇటు హారిక హాసిని బ్యానర్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఎలా కంటిన్యూ గా సినిమా లు చేస్తుంటా డో, ఇటు మైత్రీ మూవీస్ బ్యానర్ కు సుకుమార్ అలా కంటిన్యూ గా చేస్తుంటారు. అయితే సినిమా ఎప్పుడు చేసినా సరే, సుకుమార్ ను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి మైత్రి మూవీస్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలా చేయడమే మైత్రీ మూవీస్ వారికి చాలా పెద్ద ప్రాబ్లెమ్ అయ్యి పీకల మీదకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సుకుమార్-మైత్రీ సినిమాకు నిన్నటి నిన్నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ బాబు ఈ సినిమా తోనే సుకుమార్ మినిమం ఓ సంవత్సరం బిజీగా ఉంటారు ఆలోపు ఆయనతో వేరే సినిమా ఏదైనా ఒక చేసుకో వచ్చు అనుకున్నారు కానీ ఈలోపు ఆయన ఖాళీగా ఉండకుండా మహేష్ సినిమా లేట్ అవుతుందేమో అని అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లారు.

Allu arjun Sukumar

వాస్తవానికి బన్నీతో సినిమా అని మైత్రీ జనాలు సరైనోడు సినిమా టైమ్ నుంచి ఫిక్స్ అయ్యారు కానీ అది అవునా కాదా అన్న వ్యవహారంగా నడిచింది నిన్నటిదాకా కానే ఇప్పుడు అనుకోకుండా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇదే పెద్ద షాకింగ్ న్యూస్ మైత్రి మూవీస్ వాళ్లకు ఎందుకంటే క నిన్నే మహేష్ తన అనుమతి ఇచ్చాడు సుకుమార్ తో సినిమా స్క్రిప్ట్ కు. అనిల్ రావిపూడి సినిమాతో పాటు సుకుమార్ సినిమాకు కూడా డేట్ లు సమాంతరంగా చేస్తా అన్నాడు. ఈ విషయంలో మైత్రీ-సుకుమార్ ఇంకా ఏ విషయం ఫిక్స్ కాలేదు. ఇలాంటి నేపధ్యంలో బన్నీ వైపు నుంచి సుకుమార్ సినిమా ప్రకటన వచ్చేస్తోంది. అది కూడా బన్నీ సైడ్ నుంచి. ఇప్పుడు మైత్రీ వాళ్లు సైలంట్ గా వుండాల్సిన టైమ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఊకొట్టిన మహేష్ మనసు మారకుండా ఈ సినిమా చేసుకుని అటు ఇదే టైమ్ లో బన్నీ వైపు నుంచి సుకుమార్ సినిమా ఉంటుందని ఒకేసారి ప్రకటన ఇస్తే మైత్రీ మూవీస్ కు మైనస్ అయ్యే అవకాశం వుంది.

ఇది నిజం కాకపోతే సుకుమార్ తన సినిమా మహేష్ బాబు తో లేట్ అవుతుంది కాబట్టి మహేష్ ను టెంప్ట్ చేసి తమ సినిమా త్వరగా స్టార్ట్ అవడం కోసం ఇలాంటి ఎత్తు లు ఏమైనా వేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. మరిది నిజమో కాదో కాలమే నిర్ణయించాలి.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

"మా" లో మళ్ళీ రగడ

Mon Mar 4 , 2019
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలంటేనే చాలా హడావిడి వుంటుంది. ఎందుకంటే టాలీవుడ్ లో రెండు గ్రూపులు ఉన్నాయని, ఏ గ్రూపులో ఎవరు ఉన్నారనే విషయం ఈ ఎన్నికల ద్వారానే సామాన్య మానవులకు, దిగువ శ్రేణి సినీకార్మికులకు ఇలా అందరికీ తెలుస్తుంది. ఇదివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా రాజేంద్రప్రసాద్, హేమ మధ్య ఎన్ని గొడవలు జరిగాయి అనేది అంద రూ చూశారు అలాంటి ఎన్నికలు ఈసారి కూడా రాబోతున్నాయి. […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: