అనుష్క అరుంధతికి పదేళ్ళు!!

0 0
Read Time:3 Minute, 59 Second

అనుష్క అరుంధతికి పదేళ్ళు!!

అరుంధతి 10 సంవత్సరాల క్రితం తెలుగులో వచ్చిన ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా గా వచ్చి బాక్సాఫీస్ వద్ద అరుంధతి అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. అప్పటి వరకు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తున్న అనుష్క ని అమాంతం రాత్రికి రాత్రి లేడీ సూపర్ స్టార్ గా చేసిన చిత్రమిది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాంప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ అద్భుతమైన సంగీతం ఈ చిత్ర విజయానికి చాలా దోహదపడింది. అరుంధతి, జేజమ్మ ఈ రెండు పదాలు అనుష్కకి పర్యాయపదాలుగా మారిపోయాయి అంటే అతిశయోక్తి కాదేమో. పశుపతి గా సోనూ సూద్ నటన ఆయనకు డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ గాత్రం సినిమాకి ఒక గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టాయి. బొమ్మాళి నిన్ను వదల, నువ్వు నన్నేం చేయలేవురా అనే ఈ డైలాగ్స్ ఆంధ్రదేశమంతటా మారుమోగాయి.
సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద అంచనాలు ఏమి లేవు కాకపోతే ఏదో హారర్ సినిమా తీస్తున్నారు బాగా ఉంటుంది ఏమో అన్న ఆశతోనే సగటు సినీ ప్రేక్షకుడు థియేటర్ లోపలికి వెళ్ళాడు. సినిమా మార్నింగ్ షో పూర్తవడంతో బయటకు బ్లాక్  బస్టర్ హిట్ అన్న టాక్ వచ్చేసింది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అద్భుతంగా ఉంది అని అనడంతో దాదాపుగా మొదటి రోజు నుంచే అరుంధతి సినిమా కలెక్షన్ల కుంభవృష్టి మొదలయ్యింది. పదేళ్ల కిందటే దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టింది అంటే అరుంధతి సృష్టించిన సునామీ ఏంటో మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా సినిమాలో అనుష్క నటన ఆమె పాత్ర అభినయం ఆమె గెటప్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించాయి. అరుంధతి జేజమ్మ గా అనుష్క నటన మహిళా ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకుంది. శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ అత్యద్భుతమైన ప్రతిభకు అరుంధతి సినిమా ఒక నిదర్శనం. తన పని అయిపోయింది అని మాటలు విన్న నేపథ్యంలో కోడి రామకృష్ణ ఒక కసితో తీసిన సినిమా అరుంధతి. ఒకవైపు సంగీత దర్శకుడు మణిశర్మ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమా పాటలు గానీ సినిమా విజయాన్ని పెద్దవి చేశాయి. ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన డైలాగ్ రైటర్ చింతపల్లి రమణ కూడా ఒక్కసారిగా బాగా పాపులర్ అయిపోయారు. దాదాపుగా  రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకొని విడుదలకు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అరుంధతి అనే సినిమా తోటి హీరోయిన్ అనుష్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: