అభినందన్ స్టోరీ సినిమా తీస్తే ఈ హీరో సెట్ అవుతాడంట!!


ఇంతకు ముందు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఘటనపై ఒక సినిమా వచ్చేసింది అదే యూరి వికీ కౌశల్ హీరోగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పటి వరకు 250 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. యురి సైనిక శిబిరంపై టెర్రరిస్ట్ ల దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా వచ్చిన సినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. కేవలం ముప్పై అంటే ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా దానికి దాదాపు యెనిమిది రెట్ల లాభాలను పండించింది. భారత మిలటరీ సైన్యం గురించి చాలా గొప్పగా చూపించిన ఈ చిత్రం స్టోరీ డైరెక్షన్ విజువల్స్ నటన ఇలా అన్ని విధాలుగా ఒక సూపర్ హిట్ సినిమా గా నిలిచింది.

Abhinandan Indian Pilot

ఇక పోతే మొన్న రీసెంట్ గా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ 2 గురించి కూడా సినిమా తీస్తే బాగంటుందని ఈ విషయంలో కూడా సినిమా ప్రతిపాదన ఇప్పటికే వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ మేరకు టైటిల్స్ కూడా రిజిస్టర్ అయ్యాయని సమాచారం అందుతుంది. ‘పుల్వామా’అనే పేరుతో మొదలుకుని పాక్ కు పట్టు బడ్డ భారత పైలెట్ ‘అభినందన్’ పేరుతో కూడా టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయట. దీంతో ఇటీవలి యుద్ధం జరిగిన తీరు మీద కూడా సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే కేవలం సర్జికల్ స్ట్రైక్స్ 2 ఘటనపై కాకుండా అభినందన న్ జీవితం అతను ఎలా భారత వాయసేన లో చేరాడు ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ 2 లో ఎలా తన పాత్ర పోషించారు అన్న దాని మీద కథల గురించి కసరత్తులు చేస్తున్నార ట.. వింగ్ కమాండర్ అభినందన్ పాత్రకు కూడా ఒక హీరోని సజెస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఆ పాత్రకు బాగా సెట్ అవుతాడని ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి సరిహద్దు పరిణామాలపై సినిమా వస్తే.. అందులో అభినందన్ పాత్రను చేయాలని రణ్ వీర్ సింగ్ కు నెటిజన్లు సూచిస్తున్నారు. మరి ఆ హీరో ఆ క్యారెక్టర్ కు సరిపోతాడా లేదా ఒకవేళ ఆ స్క్రిప్ట్ రణ్వీర్ సింగ్ దాకా వస్తె తను ఆ సినిమా చేస్తాడా అసలు సర్జికల్ స్ట్రైక్స్ 2 ఘటన మీద నిజంగానే సినిమా వస్తుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

విజయ్ హీరో మహేష్ బాబు విలన్ మురుగు దాస్ తో సినిమా!!

Thu Mar 7 , 2019
సినిమాల్లో ఒకప్పుడు విలన్ లుగా వేస్తూ ఆ తర్వాత స్లో గా హీరోలుగా ప్రమోట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ముందే హీరోలుగా అయ్యి ఆ తర్వాత తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కూడా మళ్ళీ విలన్ పాత్రలకు కూడా ఒకే చెబుతున్న ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది ఇది ఒక్క తెలుగులోనే కాదు హిందీ తమిళ్ కన్నడ భాషలో కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అదే కోవలోకి మన టాలీవుడ్ ప్రిన్స్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: