అమెరికా కంటే ఇండియా గొప్ప దేశమా???

అమెరికా కంటే ఇండియా గొప్ప దేశమా???

అమెరికా కంటే ఇండియా గొప్ప దేశమా???

అమెరికా… ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ కంట్రీ. అటు ఆర్థిక పరంగా ఇటు రక్షణ పరంగా కూడా ప్రపంచ దేశాలను శాసించే, సవాలు చేసే సత్తా ఉన్న దేశం. అసలు ఏ దేశం కూడా అంత ఈజీగా అమెరికాతో గొడవలు పెట్టుకోవాలని దానికి శత్రువుగా మారాలని అనుకోదు అలా చేసిన ఇరాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలని అమెరికా ఎలా సర్వ నాశనం చేసిందో ప్రపంచం మొత్తం చూసింది. ఈరోజుకి కూడా అమెరికా తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా మిగతా దేశాలు వ్యతిరేకించాలి అనుకోవు మన ఇండియా విషయానికే వస్తే పాకిస్థాన్ కు మనకు ఎప్పటి నుంచో రగులుతున్న కాశ్మీర్ సమస్యను కూడా మేము పరిష్కరిస్తామని అమెరికా అనగలదు కానీ అమెరికా ఎదుర్కుంటున్న ఏదైనా ఒక సమస్యలో మనం జోక్యం చేసుకుంటాం అని అనలేని పరిస్థితి. చైనా, రష్యా లాంటి దేశాలు అమెరికా కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకోగలవు కానీ అమెరికాను దాటి వెళ్లాలి అని అవి అనుకుంటే దానికి చాలా సమయం పడుతుంది ఆలోపు అమెరికా ఇంకా శక్తి వంతమైన దేశంగా మారడానికి సిద్ధంగా ఉంటుంది.

అమెరికా కంటే ఇండియా గొప్ప దేశమా???

అమెరికా కంటే ఇండియా గొప్ప దేశమా???

కరోనా వైరస్ అన్నది చైనా తప్పిదం వల్లే వచ్చింది అని కేవలం ఒక్క అమెరికా మాత్రమే బహిరంగంగా అనగలగింది తప్పా మిగతా ఏ దేశం కూడా చైనా వైపు వేలు చుపించలేకపోయింది ఆఫ్ కోర్స్ అలా అన్నది కొంచెం తిక్క తిక్కగా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినప్పటికీ అలా చైనాను అనే సాహసం మిగతా దేశాలు చేయలేకపోయాయి. ఇక ఇప్పుడు అసలు విషయం దగ్గరకు వద్దాం… అమెరికాలో మొన్న అధ్యక్ష ఎన్నికలు జరిగాయి అయితే ఆ ఎన్నికల్లో ఇంతకుముందు ఎప్పుడూ కానటువంటి విధంగా పెద్దగా వివాదాస్పదమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోదు ఉండటంతో అతని మద్దతుదారులు ఎన్నికల కేంద్రం దగ్గర నానా హంగామా చేసి భౌతిక దాడులు కూడా చేశారు. మరొకవైపు కొత్త అధ్యక్షుడు బిడేన్ గెలిచాడు అంటూ ప్రకటనలు కూడా వెలువడ్డాయి. అయినా కూడా ట్రంప్ అతనీ విజయాన్ని ఒప్పుకోక తాను కోర్టుకు వెళ్తానని ఎన్నికల్లో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగిందని అంటూ అతని మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చారు. అమెరికాలో ఒకవైపు కరోనా కేసులు చాలా ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నా కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అటు ట్రంపు ఇటు బిడెన్ మద్దతుదారులు అమెరికాలో పెద్ద విధ్వంసమే చేశారు.

అమెరికా కంటే ఇండియా గొప్ప దేశమా???

అయినా కూడా ఇంత వరకు అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఇప్పటికి కూడా ఇంకా ఒక క్లారిటీ రాకపోవడం అన్నది ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన దేశం అయినా అమెరికా ప్రజాస్వామ్యం ఈ ఎన్నికలతో మిగతా దేశాల ముందు అపహస్యం అయ్యింది అని చెప్పక తప్పదు. అమెరికా కంటే వెనకబడి ఉన్న మన ఇండియాలో కూడా ఎన్నికల అప్పుడు ఇలాంటి ఎన్నో ఆటంకాలు ఎదురైనా కూడా చివరకు పలాన పార్టీ గెలిచింది అని ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక అందరూ సైలెంట్ అయిపోతారు. చాలా సార్లు అధికారంలో ఉన్న పార్టీ కూడా ఓడిపోవడం వాళ్ళు ఎంత రిగ్గింగ్ చేశారు ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారు అని ప్రతి పక్షాలు మొత్తుకున్నా కూడా అంతిమంగా ప్రజల తీర్పు ను ఇక్కడ అందరూ గౌరవిస్తారు. అమెరికా తో ఇండియా ఎన్నో విషయాల్లో పోటీ పడనప్పటికి ఎన్నో రకాలుగా అమెరికా కంటే ఇండియా తక్కువ స్థాయిలో ఉన్న కూడా వాళ్ల డాలర్ తో మన రూపాయి విలువ రోజు రోజుకి కిందకు పడి పోతున్నా కూడా ఒక్క ప్రజాస్వామ్యం విషయంలో ప్రజల తీర్పును నాయకులు గౌరవించే విషయంలో మాత్రం మన ఇండియా కేవలం అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

Leave a Reply

Next Post

Nidhi Aggerwal Latest Dance Video

Wed Nov 18 , 2020
https://twitter.com/AgerwalNidhhi/status/1328552632353386497?s=09
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: