అయ్యో జాన్వీ అలాంటి సినిమాలోనా??

0 0
Read Time:3 Minute, 5 Second

అందాల తార శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ సినిమా దడక్ తో హీరోయిన్ గా పరిచయమైన జాన్వి కపూర్ మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తల్లి శ్రీదేవి అందాన్ని పుణికిపుచ్చుకున్న ఈ అందాల సుందరి తన రెండో సినిమా కోసం కూడా ఇప్పుడు రెడీ అవుతుంది. మొదటి సినిమా ఒక లవ్ స్టోరీ చేసిన జాన్వి ఇప్పుడు రెండో సినిమా కోసం ఒక హారర్ జోనర్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య బాలీవుడ్ లో స్త్రీ అనే హారర్ కామెడీ సినిమా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

1990 వ దశకంలో భారతదేశంలోని కొన్ని మారుమూల గ్రామాల్లో రాత్రిపూట దయ్యం తిరుగుతుందని అది ఊర్లో ఉండే యువకుల్ని ఎత్తుకుపోతుంది అనే కథతో ఈ సినిమాను రూపొందించారు. అయితే అప్పట్లో నిజంగానే ఇలా దయ్యం ఉందని భయపడిన గ్రామస్తులు అందరూ తమ ఇళ్లముందు గోడల మీద ఓ స్త్రీ రేపు రా అని రాసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ మూఢనమ్మకం గ్రామాల్లో బాగా ఉండిపోయింది. అయితే ఈ ఘటనలు ఈ నమ్మకాల మీద సెటైరికల్గా వచ్చిన స్త్రీ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. అలాగే బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కలక్షన్స్ ఆర్జించి పెట్టింది.

దాంతో ఇప్పుడు బాలీవుడ్ చూపు మరోసారి హారర్ కామెడీ సినిమాల మీద పడింది. ఈ మధ్య జాన్వి కపూర్ కి ఒక దర్శకుడు హారర్ కామెడీ కథ చెప్పడం దానికి జాన్వికపూర్ పచ్చజెండా ఊపడం జరిగిపోయిందట. అయితే ఈ సినిమాలో జాన్వి దయ్యం పాత్రలో నటిస్తుందా లేదా మామూలు పాత్రలో నటించబోతుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే స్త్రీ సినిమాలో హీరోగా చేసిన రాజ్ కుమార్ రావు ఈ చిత్రం లో కూడా హీరోగా నటించబోతున్నారట. ధడక్ సినిమాకి ప్రేక్షకుల నుంచి విమర్శకుల నుంచి మంచి రివ్యూలు వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఎక్కువ కలెక్షన్లు సంపాదించలేకపోయింది. తన రెండో సినిమాతో అయినా జాన్వికపూర్ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: