అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మా సినిమా మళ్ళీ రీషూట్ చేస్తారట

అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మా సినిమా మళ్ళీ రీషూట్ చేస్తారట

అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విజయ్ దేవరకొండ ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయాడు. ఇదే సినిమాని దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ గా కూడా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కనిపించిన హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ తెలుగు సినిమాలలో చాలా బిజీ కామెడీ ఆర్టిస్టు అయిపోయాడు. ఇలా ఎంతో మంది కి బ్రేక్ ఇచ్చిన ఈ సినిమాని తమిళ్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ తో ప్రముఖ తమిళ దర్శకుడు బాలా తో వర్మ పేరుతో  రీమేక్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. 
వర్మ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్
అయితే అంతలోనే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి అఫిషియల్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు లో ఈ సినిమా ఒరిజినల్ సినిమాతో సరిపోయే విధంగా రాలేదని చాలా క్రియేటివ్ డిఫరెన్స్ ఉండడం వల్ల సినిమా అవుట్ పుట్ ప్రొడ్యూసర్లకు నచ్చడం లేదని అందుకే ఈ సినిమాని మళ్ళీ వేరే దర్శకుడుతో చేయాలని అనుకుంటున్నామని ఆ ప్రెస్ నోట్ లో చెప్పారు. బాలా లాంటి దర్శకుడు తీసిన వర్మ సినిమా ప్రొడ్యూసర్స్‌కి నచ్చక పోవడం అనేది ఇప్పుడు చాలా వివాదాస్పదంగా మారుతోంది ఇప్పటికే చాలా డిఫరెంట్ సినిమాలతో అద్భుతమైన డైరెక్షన్ టెక్నిక్స్‌తో తనేంటో ప్రూవ్ చేసుకున్న వర్మ లాంటి దర్శకుడు అర్జున్ రెడ్డి రీమేక్ ను సరిగా చేయలేదా..?? చేయలేకపోయాడ  అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక భాషలో కల్ట్  సినిమాగా చాలా గొప్ప పేరు సంపాదించుకున్న సినిమాని మరో భాషలోకి చేస్తున్నప్పుడు ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ సినిమా మీద అనుమానం రావడం సహజమే అయితే బాలా లాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా ఆ సినిమా నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైన దనే చెప్పాలి. ఇప్పుడు మళ్లీ కొత్తగా సినిమా మొత్తం షూటింగ్ చేయాలి అంటే ప్రొడ్యూసర్స్ కు  కూడా అది పెనుభారమే అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే సినిమా గురించి వాళ్ళు ఎంత ప్యాషన్‌తో ఉన్నారు అన్నది అర్థం చేసుకోవచ్చు బాలా లాంటి ప్రముఖ దర్శకుడు ని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారు ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఎవరిని వరిస్తుందో అన్నది వేచి చూడాలి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన మహేష్ బాబు మహర్షి సినిమా

Thu Feb 7 , 2019
డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన మహేష్ బాబు మహర్షి సినిమా https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: