అర్జున్ రెడ్డి విజయ్ దేవర కొండ నిర్మాత పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ హీరో!!

పెళ్లిచూపులు సినిమాతో హీరో విజయ్ దేవరకొండకు బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి అనే సినిమా తో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అది వేరే విషయం అనుకోండి. అయితే తనను ఫస్ట్ హీరోని చేసిన తరుణ్ నే ఇప్పుడు లీడ్ రోల్ లో పెట్టి హీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా నిర్మిస్తున్నాడు. మీకు మరీ గమ్మత్తుగా అనిపించినప్పటికీ ఇది నిజం. విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో ఒక సినిమా స్టార్ట్ అయింది దీంట్లో మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ చాలా మట్టుకు మేకోవర్ కూడా అయ్యాడు.

మొన్నటి వరకు తరుణ్ కాస్త లావుగా గడ్డం, మీసంతో వుండి ఇప్పుడు లుక్ మార్చాడు, గడ్డం, మీసం తీసేశాడు. జుట్టు కూడా కాస్త పెంచుతున్నాడు. బరువు తగ్గే పనిలో కూడా బిజీగా ఉన్నాడు. నిన్న మిఠాయి ఆడియో లాంఛ్ లో ఇలా సరికొత్తగా కనిపించాడు తరుణ్.

కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ మెంట్ అని బ్యానర్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ఈ ప్రొడక్షన్ హౌజ్ పై తొలి ప్రయత్నంగా తనకు బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తున్నాడు. షమ్మీర్ అనే అతను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. అయితే ఈ సినిమాకు “మీకు మాత్రమే చెప్తా” అనే టైటిల్ ఫిక్స్ చేశారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఫిలింఛాంబర్ లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందట.

తరుణ్ భాస్కర్ కు కెమెరా కొత్తకాదు. 2-3 చిన్న పాత్రలు చేశాడు. ఫలక్ నుమా దాస్ అనే సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా లీడ్ రోల్ పోషించే స్థాయికి ఎదిగాడు. అయితే అవకాశాలొస్తున్నాయి కాబట్టి చేస్తున్నానని, తన మొదటి ప్రాధాన్యం దర్శకత్వానికే అంటున్నాడు తరుణ్ భాస్కర్.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

వైష్ణవ తేజ్ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో విజయ్ సేతుపతి

Mon Feb 18 , 2019
సుకుమార్ రైటింగ్స్ పతాకంపై హీరోగా పరిచయమవుతున్న వైష్ణవ తేజ్ సినిమాలో ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తారనే వార్త సినిమా సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. సాయి ధరంతేజ్ తమ్ముడిగా అటు చిరంజీవి మేనల్లుడు గా వైష్ణవ తేజ్ సినిమా కి ఇప్పటికే చిన్న హైప్ స్టార్ట్ అయింది ఈ సినిమాకి ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: