Read Time:2 Minute, 56 Second
అల్లు అర్జున్ @150 కోట్లు – అల వైకుంఠపురములో 19 డేస్ కలెక్షన్స్..

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా రెండు వారాలు ముగిసిన తర్వాత కూడా రికార్డు వసూళ్లు సాధిస్తూనే ఉంది. తొలివారమే బయ్యర్లు అందర్నీ సేఫ్ జోన్కు తీసుకొచ్చిన ఈ చిత్రం మూడో వారం కూడా కుమ్మేసింది. కేవలం రెండో వారంలోనే 12 కోట్ల షేర్ వసూలు చేసింది అల వైకుంఠపురములో. ఇప్పటి వరకు 19 రోజుల్లోనే ఈ చిత్రం 150 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్గా అవతరించింది.
నాన్ బాహుబలిలో అన్ని రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు బన్నీ. ముఖ్యంగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బన్నీ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది.

నైజాంలో అయితే ఏకంగా 40 కోట్ల షేర్ వసూలు చేసి కొత్త రికార్డులకు తెరతీసాడు బన్నీ. బాహుబలి కాకుండా మరో సినిమా ఏదీ నైజాంలో 35 కోట్ల మార్క్ అందుకోలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ చేసాడు. ఇంకా సినిమా బాగానే ఆడుతుంది కాబట్టి కచ్చితంగా నైజాంలో మరో 2 నుంచి 3 కోట్లు వస్తాయి. ఇక సీడెడ్ 19.25 కోట్లు.. ఉత్తరాంధ్ర 21.43 కోట్లు.. గుంటూరు 10.80 కోట్లు.. ఈస్ట్ 12.45 కోట్లు.. వెస్ట్ 8.72 కోట్లు.. కృష్ణ 10.40 కోట్లు.. నెల్లూరు 4.90 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో 125 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.

ఇక ఓవర్సీస్లో 18.50 కోట్ల మార్క్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్నాడు బన్నీ. రంగస్థలం, సైరా రికార్డులను కూడా పూర్తిగా తుడిచేసాడు బన్నీ. కెరీర్ మొదలైన ఇన్నేళ్ళ తర్వాత తొలిసారి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు అల్లు వారబ్బాయి. మూడో వారంలోనూ అల వైకుంఠపురములో దూకుడు అలా కొనసాగుతూనే ఉంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss