అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇక రచ్చ రచ్చే!!!

        బాహుబలి లాంటి మెగా సినీమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు అన్న అంచనాలకి తగ్గట్లుగా జూనియర్ ఎన్టీఆర్ రాంచరణ్ లతో ఆయన ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్నో ఊహాగానాలు పుకార్లు వచ్చాయి ఈరోజు జరిగిన ప్రెస్మీట్లో వాటన్నిటికీ తెరదించుతూ రాజమౌళి స్వయంగా తన సినిమా గురించి అన్ని వివరాలు ప్రకటించాడు. 

              సినిమా 19 20 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అలాగే తెలంగాణ స్వాతంత్ర్య సమర పోరాట యోధుడు కొమరంభీం గా జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు అని చెప్పాడు. ఇద్దరూ ఒకే సమయంలో పుట్టారని అలాగే ఒకే సమయంలో తమ ఇళ్లలో నుంచి వెళ్లిపోయి ఆ తర్వాత వచ్చి స్వాతంత్ర్య పోరాటాలు చేశారని తాను ఈ కథ ని తీసుకొని సినిమా చేస్తున్నానని రాజమౌళి ప్రకటించారు.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ రామ్ చరణ్కు జోడీగా అల్లూరి సీతారామరాజు మరదలి పాత్రలో నటించబోతోందని అలాగే ఒక బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించబోతుంది అని చెప్పారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక కీలకమైన ఎపిసోడ్ లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు అని స్పష్టం చేశారు. బడ్జెట్ 400 కోట్ల వరకు ఉంటుందని సినిమాను 2020 జులై 30వ తారీకు విడుదల చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇంత వరకు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ వీరిద్దరూ స్వాతంత్ర పోరాటం చేశారు అన్న విషయాలు తెలుసని వారిద్దరూ తమ తమ జీవితాల్లో స్వాతంత్ర పోరాటం చేయకముందు ఏం చేశారు ఎలా వారు అంత గొప్ప వీరులుగా తమ జీవితాల్లో మారారు అన్న కొత్త కోణాన్ని ప్రజలకు తెలియని కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం అని రాజమౌళి చెబుతున్నారు. వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరి వరకు ఈ సినిమా షూటింగ్ జరగబోతుందని ఈ సినిమాలో కూడా వి ఎెక్ట్స్ చాలా వరకు ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమంలో రాజమౌళి కాబట్టి తామిద్దరం కథ కూడా వినకుండా ఈ సినిమాను ఒప్పుకున్నామని జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చెప్పారు. మరో డైరెక్టర్ ఎవరైనా తమ ఇద్దరితో ఒక సినిమా చేయటానికి ముందుకు వస్తే ఆ సంగతి అప్పుడు ఆలోచిస్తామని ప్రస్తుతం మాత్రం కేవలం తమకు రాజమౌళి మీద ఉన్న నమ్మకమే ఈ సినిమాను చేసేలా ఉత్సాహం ఇచ్చిందని చెప్పారు.రాజమౌళి కూడా తాను ఈ పాత్రలు కేవలం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రమే ఊహించుకున్నా అని ఎవరిని ఊహించు కోలేదని చెప్పుకొచ్చారు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

RRR press meet and Updated Photos

Thu Mar 14 , 2019
RRR press meet photos Director SS Rajamouli with Samuthirakani on  #aakashavaani sets RRR PRESSMEET IMAGES JUNIOR NTR AND RAM CHARAN https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: