అవసరాల దర్శకత్వంలో నాగ శౌర్య


Nagashourya
నాగసౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒకటి మొదలు కానుంది. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ చిత్రాలలోని హీరో హీరోయిన్లు అలాగే దర్శకులు వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ చాలా ఆసక్తి ఉంటుంది. అయితే ఇప్పుడు అలా ఇంట్రస్ట్ ని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది.దీనిని, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మించబోతోంది.

ఆమధ్య హీరో నాగ శౌర్య,మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రేక్షకులకు తెలిసిందే. అలాగే ‘నాగసౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల కూడా మాంచి హిట్ అయిన విషయం తెలిసిందే.

మళ్ళీ ఇప్పుడు వీరి కాంబినేషన్లో హీరోగా నాగ శౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మార్చి రెండవ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

జనాల మీద కేబుల్ పిడుగు!!!

Sun Mar 3 , 2019
మీకు నచ్చిన ఛానెల్ ను మాత్రమే చూడండి. చూసిన దానికి మాత్రమే బిల్లు కట్టండి. ఇది నిన్న మొన్నటివరకు ఊదరగొట్టిన ప్రైవేట్ డీటీహెచ్ హంగామా ఇప్పుడు దీనికి ట్రాయ్, కేంద్రప్రభుత్వం కూడా వత్తాసు పలకడంతో ప్రజల నుంచి మరో కొత్త నిలువుదోపిడీకి రంగం సిద్ధమైంది. నిజం చెప్పాలంటే కిందటి నెలలోనే ఈ పథకం అమలు కావాలి. కానీ దీనికి టైమ్ ను మరో నెలరోజులు పొడిగించారు. ఆ డెడ్ లైన్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: