అవెంజర్స్- ఎండ్ గేమ్’ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్

ఆంటోనీ రుస్సె, జో రుస్సో దర్శకత్వం వహించిన అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం సూపర్ విలన్ 
థానోస్… సూపర్ హీరోస్ ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికా మధ్య జరిగే పోరాటం ప్రధాన ఇతివృంగా రూపొందించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన 22వ సినిమా ఇది.

     
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం అవెంజర్స్-ది ఎండ్ గేమ్ఎట్టకేలకు శుక్రవారం విడుదలైంది. రిలీజ్ ముందే భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌తో సంచలనం క్రియేట్ చేసిన ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీసు వద్ద అంచనాలకు మించిన వసూళ్లతో అదరగొట్టింది.
యూఎస్‌ఏతో పాటు ఇండియాలో భారీ రిలీజ్ అవెంజర్స్-ఎండ్ గేమ్ శుక్రవారం అమెరికాలో దాదాపు 4600 థియేటర్లలో విడుదలైంది. ఇండియాలో దాదాపు 3 వేల స్క్రీన్లలో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల 24 గంటల గ్యాప్ లేకుండా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు
తొలి రోజు బాక్సాఫీస్ దద్దరిలింది వరల్డ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…అవెంజర్స్: ఎండ్ గేమ్తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా $169 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు రూ.1186 కోట్లు వసూలు చేసిందన్నమాట. ఇది ఇప్పటి వరకు అందిన రిపోర్ట్ మాత్రమే, పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇంత భారీ మొత్తం వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.


చైనాలో హయ్యెస్ట్ వసూళ్లు 


చైనాలో అత్యధికంగా తొలి రోజు $107.5 మిలియన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చైనాలో యూఎస్ఏ కంటే రెండు రోజుల ముందుగా బుధవారం విడుదలైంది. ఫస్ట్ డే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన విదేశీ చిత్రంగా రికార్డులకెక్కింది. ఆస్ట్రేలియాలో $7 మిలియన్, సౌత్ కొరియాలో $8.4 మిలియన్, ఫ్రాన్స్‌లో $6 మిలియన్ వసూలైనట్లు సమాచారం.ఇక ఇండియాలో అవెంజర్స్:ఎండ్ గేమ్చిత్రానికి భారీగా డిమాండ్ ఉంది. కేవలం బుక్ మై షో ద్వారానే రిలీజ్ ముందు దాదాపు 2.5 మిలియన్ టిక్కెట్స్ అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ మూవీకి ఈ స్థాయిలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగలేదు. చాలా థియేటర్లలో ఫస్ట్ వీకెండ్ వరకు ముందుగానే బుకింగ్స్ జరిగిపోయాయి. ఇండియన్ కలెక్షన్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

#1 ON TRENDING #MaharshiTrailer | Mahesh Babu, Pooja Hegde, Allari Naresh | Vamshi Paidipally | DSP | 4K

Thu May 2 , 2019
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: