ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది


2019లో సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ అలాగే లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న విడుదల చేసిన నోటిఫికేషన్ లో లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగుతాయని ప్రకటించింది. మార్చి 25 తేదీ వరకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసే వారందరూ తమ నామినేషన్లు వేసుకోవాలి. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా మార్చి 28 నిర్ణయించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అటు అధికార తెలుగుదేశం పార్టీ ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల పాదయాత్రలు పోరాట యాత్ర లు ప్రచార సభలో అంటూ అనధికారికంగా ఎన్నికల భేరి మోగింది. ఇప్పుడు ఇంకా అధికారికంగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఇక మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే పోతున్నాయి. ప్రచార హోరు జోరు తో రాబోయే నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మినీ కురుక్షేత్ర సంగ్రామమే జరగనుంది.

ఇప్పటికే గత తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఉంది. అతి అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మీద ఇంతకుముందు పలు రకాల కేసులు ఉన్న ఆ పార్టీ ఆయన మీదనే కొండంత ఆశలు పెట్టుకుంది. జనం అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతి తో విసిగిపోయి ఉన్నారని ఈ సారి ఎలాగైనా తమని గెలిపిస్తారని చాలా పాజిటివ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఉన్నాయి. విధంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా తమ పార్టీనే ఉందని పలు సామాజిక వర్గాలు కూడా ఇక వేరే దారి లేక తమకు ఓటు వేయాలని ఆ పార్టీ చాలా నమ్మకంతో ఉంది.ఇప్పటికే పలు నియోజకవర్గాల కు ఎమ్మెల్యే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సందర్భంలో ఇకముందు ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా ఆ పార్టీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించబోతుంది. పలు కుల సమీకరణాలు అలాగే ఆర్థిక సమీకరణాలు కూడా లెక్కలోకి తీసుకోవడం ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి పార్టీ సమాయత్తమవుతోంది.

ఈలోపు అటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా నాయకులు వైఎస్సార్ సీపీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి బాబు ఎన్నికలప్పుడు నాయకులు పార్టీలు మారడం అన్నది చాలా సాధారణంగా జరిగే తంతే కాబట్టి ఈ ఫిరాయింపు దారులకు కూడా టిక్కెట్లు ఇచ్చి వారిని తమ గెలుపు గుర్రాలు గా మార్చుకోవడానికి అన్ని పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తాయి అని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్ ఆమంచి కృష్ణమోహన్ లాంటి కొంత మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి కొన్ని వలస లో ఉన్న అవి నామ మాత్రం గా కనిపించాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హోరాహోరి పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం తెలుగుదేశం పార్టీ కూడా తాము చేసే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి తమను ఈసారి మళ్లీ ఎన్నికల్లో గెలిపిస్తాయని తమ నాయకుడు చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్ కి రక్షకుడు అన్న చందంగా మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే జన్మభూమి నీరు-మీరు లాంటి కార్యక్రమాల ద్వారా చాలా అవినీతి రాష్ట్రంలో జరిగింది అని ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాల నుంచి ఎలాంటి విద్యా రంగంలో వచ్చిన వాటినన్నింటినీ పక్కదారి పట్టిస్తూ ఎన్నికల రంగంలోకి దూసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా రెడీ అవుతుంది.

Babu jagan pavan
చంద్రబాబు చాణక్యం ఎన్నికల్లో అద్భుతంగా పని చేయబోతుందని ఎలాగైనా సరే తాము మళ్ళీ తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని అని ఆ పార్టీ నాయకులు కొండంత ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఐటీ గ్రిడ్ ఓట్ల తొలగింపు లాంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసిన నేపథ్యంలో ఒకసారి గడచిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాన్ని గమనిస్తే అటు అధికార పార్టీ తెలుగుదేశానికి ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య వచ్చిన ఓట్ల తేడా కేవలం 3 శాతం మాత్రమే అది కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఆ పార్టీ గట్టెక్కించడానికి సాయ పడ్డారని అందుకే ఆ ఓట్ల శాతం అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి మళ్ళిందని అప్పటి విశ్లేషకులు చెప్పారు. అయితే ఇప్పుడు సుమారు 56 లక్షల ఓట్ల గల్లంతు జరుగుతుందని ఆ ఓట్లను తీసేయడానికి అధికార తెలుగుదేశం పార్టీ అన్ని కుట్రలు చేసిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పోలింగ్ శాతం ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు పడ నున్నాయనేది చాలా కీలక మైన అంశంగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కుల సమీకరణాలు కొంచెం ఎక్కువే ఏ పార్టీకి ఏ కులం ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా బహిరంగ రహస్యమే ఇప్పుడు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో మరి ఏ కులం ఏ పార్టీకి ఎంతగా సపోర్ట్ చేస్తుంది అనేవి చాలా వరకు ఆయా పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను కూడా ప్రభావితం చేయబోతున్నాయి అని చెప్పవచ్చు.

సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి ఓటరు మహాశయుని ఆకట్టుకునే లేదా కొని అధికారంలోకి రావడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ సర్వశక్తులూ ఒడ్డబోతున్నాయి. ఎన్నికల్లో మొదటిసారిగా తన సొంతబలంతో పోటీ చేయబోతున్న జనసేన పార్టీ మేరకు తన ప్రభావాన్ని చూపుతుంది అనేది కూడా తెలియ బోతుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ఇదే తన బలం చాలా ఎక్కువ అని ఎప్పుడూ చెప్పుకునే పవన్కళ్యాణ్ ఈసారి నిజంగా తను సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఆ బలం ఏమిటి అన్నది ప్రత్యక్షంగా తెలుసు కో. నిజానికి కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కూడా జనసేన పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్నటివరకు జనసేన పార్టీ అభ్యర్థుల కోసం ఇంటిలో నిర్వహించడం సాధారణ ప్రజల నుంచి కూడా అప్లికేషన్ తీసుకోవడం ద్వారా జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాలలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. జనతా పార్టీ అభ్యర్థిత్వం కోసం చాలా మంది సామాన్య జనం కూడా అప్లై చేసుకున్నారు. వీరిలో ఎంతమంది జనసేన పార్టీ టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన అని చెప్పుకుంటున్న ఆ పార్టీ నిజంగానే సామాన్య ప్రజల నుంచి కొంత మందిని ఎంపిక చేసి వారికి టికెట్లు ఇస్తుందా లేదా అన్నది కూడా ఒక నెల రోజుల్లో తేలిపోనుంది. ఇది తెలుగుదేశం పార్టీని అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ap ప్రజాపోరాట యాత్ర ద్వారా ప్రశ్నిస్తూ నిలదీస్తూ వారి మీద పలు అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ సారి ఎలాగైనా అధికారాన్ని జనసేన పార్టీ ఇవ్వండి మార్పు తీసుకొచ్చే చూపిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తాం అంటూ చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా యువత మహిళల్లో పవన్ కళ్యాణ్ కి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన జనాలు ఆయన సభలకు ఆయన యాత్రలకు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. నటుడు కాబట్టి జనం అలా వస్తున్నారు అని ఆ పార్టీ వ్యతిరేకులు పలు సార్లు చెప్పిన నిజానికి పవన్ కళ్యాణ్ కి ఒక రాజకీయ నాయకుడిగా కూడా అంతో ఇంతో చరిష్మ ఉందనేది జగమెరిగిన సత్యం.

అయితే తన మద్దతుదారులు తన అభిమానులు తన సానుభూతిపరులు ఇలా అందరి ఓట్లను పవన్ కళ్యాణ్ ఈ సారి తన పార్టీకి వచ్చేలా చేసుకోగలరా లేరా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా ఇప్పుడు మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కేవలం 70 లక్షల ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుని మూడో స్థానానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయి అనేది కూడ ఆంధ్రప్రదేశ్ లో చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. నిన్నటికి నిన్న విడుదలైన సి ఓటర్ సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ప్రధాన పోటీ తెలుగు దేశం పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మధ్యే ఉంటుందని జనసేన ఖాతా కూడా తె రవదు అని వచ్చింది. మరి అదే నిజంగా మారనుందా లేక జనసేన పార్టీ కూడా గణనీయమైన సంఖ్యలో ఓట్ల శాతం తెచ్చుకొని ఎక్కువ అసెంబ్లీ సీట్లు సంపాదించుకొని కింగ్మేకర్గా ఉందా లేదా అన్నది కూడా తెలియాలంటే ఒక నెలరోజులపాటు ఓపిక పట్టక తప్పదు. కర్ణాటక రాష్ట్రంలో జే డి ఎస్ పార్టీ లాగా తను కూడా కింగ్ మేకర్ అయ్యే అవకాశం లేకపోలేదు అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా బలంగా నమ్ముతూ వచ్చారు భోజనం ఆ పార్టీకి ఓటు వేసి దాన్ని నిజం చేస్తారో లేదో కూడా చూడాలి. ఇకపోతే ఇటు తెలుగుదేశం పార్టీకి అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా చాలా బలమైన నిర్మాణం ఉండడం ఎక్కువ మంది నాయకులు కార్యకర్తలు ఉండడం అనేది రెండు పార్టీ లకి పెద్ద బలం గానే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ సారి జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్య గానే విశ్లేషకులు భావిస్తున్నారు.

అందు గురించే రాజకీయ పార్టీలు ఈసారి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తాయి. అప్పుడు ఇక ఓటుకు ఇంత అని బహిరంగంగా ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నియోజకవర్గాల వారీగా తమ కులం ఓట్లను లేదా తమ మద్దతుదారులను ప్యాకేజీల ద్వారా ఎమ్మెల్యే అభ్యర్ధులు కొంటు ఉంటారు. ఐదు ఏళ్ళ తమ భవిష్యత్తును కాదని కేవలం బిర్యానీ ప్యాకెట్ ల కోసం క్రికెట్ కిట్ల కోసమో లేదా బంగారం కోసం చీరల కోసం డబ్బు కోసం సాధారణ ప్రజలు ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపిస్తూ ఉంటారు. మరి ఈసారైనా ఆ విషయంలో సాధారణ ప్రజల నాడి మారి తమకు మేలు చేసే అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిద్దాం.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రణవీర్ సింగ్ లేటెస్ట్ ఫోటోస్

Mon Mar 11 , 2019
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: