ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ దే హవానా?


ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి పక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెరిగిందని పేర్కొంది ఇండియాటుడే. అక్కడ మరికొన్ని నెలల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వివిధ సర్వేలు నిర్వహిస్తూ వస్తున్న ఈ ఇంగ్లిష్ వార్తా చానల్ తాజాగా ఏపీలో రాజకీయ పరిస్థితి గురించి తన అంచనాలను వెలువరించింది. వాటి ప్రకారం ఆరునెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెరిగింది అని చెపుతుంది.

Jagan pavan kalyan to give tough fight to babu
సిక్స్ మంత్స్ బ్యాక్ జగన్ కు 43శాతం మంది మద్దతు కనిపించిందని, గత ఏడాది సెప్టెంబర్లో ఆ పరిస్థితి ఉండగా ఈ ఏడాది ప్రస్తుత నెల ఫిబ్రవరిలో జగన్ కు లభించిన మద్దతు శాతం 45 అని పేర్కొంది. ఈ ఆరు నెలల కాలంలో జగన్ గ్రాఫ్ లో రెండు శాతం పెరుగుదల నమోదైందని ఈ చానల్ పేర్కొంది.ఇదే టైమ్ లో ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి గ్రాఫ్ రెండుశాతం డౌన్ అయ్యిందని ఇండియాటుడే వివరించింది. గత ఏడాది సెప్టెంబర్లో బాబుకు లభించిన మద్దతు శాతం 38 కాగా, ఇప్పుడు 36శాతం మంది మాత్రమే బాబును సపోర్ట్ చేస్తున్నారని పేర్కొంది.

ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ కు 45శాతం మద్దతు ఉండగా, బాబుకు 36 శాతం మంది మద్దతు ఉందని ఇండియాటుడే వివరించింది. ఇద్దరి మధ్య తేడా కేవలం తొమ్మిది శాతం అని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ గ్రాఫ్ లో ఒకశాతం తగ్గుదల నమోదైందని ఇండియాటుడే వివరించింది.గత ఏడాది సెప్టెంబర్ నాటికి పవన్ కు ఉండిన మద్దతు శాతం ఐదు కాగా, ప్రస్తుతం పవన్ గ్రాఫ్ నాలుగు శాతం వద్ద ఉందని ఇండియా టుడే పేర్కొంది. ఇతరులకు ప్రస్తుతానికి 15శాతం మద్దతు ఉందని తమ సర్వేలో తేలినట్టుగా వివరించింది ఇండియాటుడే. క్రితం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సాధించుకున్న ఓట్ల శాతం మధ్య తేడా అత్యల్పం అని అలాంటి చోట జగన్ తొమ్మిది శాతం లీడ్ లో ఉండటం వచ్చేసారి భారీ వ్యత్యాసం ఉండోబోతోందని ఏదో ఒక్క పార్టీ కే ఎక్కువ సీట్లు వస్తాయి అని ప్రజల తీర్పు చాలా క్లియర్ గా కనబడుతోంది అని చెప్పడానికి ఇదే రుజువని ఆ చానల్ చెప్పింది.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

మహేష్ బాబు ఎ ఏం బి సినిమాస్ కు నోటిసులు

Wed Feb 20 , 2019
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్తగా సినిమా వ్యాపారంలోకి దిగి AMB సినిమాస్ ను ప్రారంభించిన విషయం గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి రంగ రెడ్డి జీ ఎస్ టి అధికారులు నోటిసులు అందించారు దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం తగ్గించిన జీ ఎస్ టి రేట్స్ ఆధారంగా సినిమా టికెట్స్ ధర సదరు సినిమా యాజమాన్యం వారు తగ్గించ లేదని ఇంకా పాత రేట్స్ ఆధారంగా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: