ఆకట్టుకుంటోన్న లుక్ అమ్మవారి పాత్రలో నయనతార..

విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్లో ‘అరం’, ‘డోరా’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’, ‘కొలైయుదిర్‌కాలం’… వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
బాపు చిత్రం, బాలయ్య సరసన ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్ర చేసి.. అచ్చం సీత అంటే ఇలాగే ఉంటుందా? అనేలా యాక్ట్ చేసిందీ బ్యూటీ. ఇప్పుడు తమిళ సినిమా ‘మూకుత్తి అమ్మన్’ సినిమాలో నయన్ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతుంది. ఈ చిత్రం (Mookuthi Amman first look) ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నయన్ అమ్మవారి రూపంలో కనిపించి, ఆకట్టుకుంటోంది. ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే ఈ సినిమా కోసం నయనతార శాఖాహారిగా మారిందట. అమ్మవారి సినిమా కాబట్టి మాంసాహారం ముట్టుకోవద్దని నిర్ణయించుకుని సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఆ విధంగానే పాటించిందట. నయనతార ఈ సినిమాతో పాటు ప్రస్తుతం రజనీకాంత్ (RajiniKanth)తో 168వ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న సినిమాలోనూ నయనతార నటించనుందని సమాచారం.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
0 Comments