ఆయన్నే పెళ్లి చేసుకుంటా…..తన లవ్ ఎఫైర్‌పై స్పందించిన కియారా

ఆయన్నే పెళ్లి చేసుకుంటా…..తన లవ్ ఎఫైర్‌పై స్పందించిన కియారా

కియారా అద్వానీ..  మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన ‘విన‌య విధేయ రామ’లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. 
                 

               

అయితేనేం..హిందీలో ఈ భామ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్..’కబీర్ సింగ్‌’లో చేసింది. ఆ సినిమా సక్సెస్‌తో మంచి ఫాంలో ఉంది కియారా. తెలుగు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వివాదాల మద్య కూడా అద్బుతమైన వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. కబీర్ సింగ్  ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. ఈ విజయంతో సూపర్ ఫామ్‌లో ఉన్న కియారా.. ఈ వివాదాల గురించి.. సహ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో వస్తున్న లవ్ ఎఫైర్‌ గురించి స్పందించారు..
నేను సిద్ధార్థ్‌తో డేటింగ్‌లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదు. నేను సింగిల్‌గానే ఉన్నాను. కానీ కచ్చితంగా నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అంటూ స్పష్టం చేసింది. ఆ తర్వాత కబీర్ సింగ్ వివాదంపై స్పందిస్తూ..  ‘కబీర్‌ సింగ్’ సినిమాలో హీరో, హీరోయిన్లు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం గురించి.. ఆమె మాట్లాడుతూ..వారు ‘అలా కొట్టుకోవడం, నోటికొచ్చినట్లు తిట్టుకోవడం నాక్కూడా నచ్చదు. అయితే సినిమా వేరు, నిజ జీవితం వేరు. నా జీవితంలో మాత్రం అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటానని.. అంతేకాదు నాపై నా భర్త చెయ్యిని పడనివ్వను’ అని తెలిపింది.. కియారా. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘లక్ష్మీబాంబ్‌’ అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది…..https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఇస్మార్ట్ శంకర్ - డియర్ కామ్రేడ్ మధ్య చిచ్చుపెట్టిన రాంగోపాల్ వర్మ

Tue Jul 30 , 2019
ఇస్మార్ట్ శంకర్ – డియర్ కామ్రేడ్ మధ్య చిచ్చుపెట్టిన రాంగోపాల్ వర్మ ఇటీవల విడుదలైన రెండు తెలుగు సినిమాలు.ఒకటి పక్కా క్లాస్ అయితే.. మరొకటి పక్కా ఊరమాస్.. డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్‌గా పెర్ఫామ్ చేస్తుండగా.. ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పూరికి ఈ సినిమాతో ఆ దాహం తీరిపోయింది. నిజానికి ఇస్మార్ట్ శంకర్‌కు ఇంత పెద్ద విజయం […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: