0.6 C
New York
January 26, 2021
CINEMA RASCALS
Entertainment News Latest Movies reviews Trending Now

ఆర్ఆర్ఆర్ సినిమా స్టొరీ లీక్ ???

ఆర్ఆర్ఆర్ సినిమా స్టొరీ లీక్ ???

ఎస్ ఎస్ రాజమౌళి ని తెలుగు ఇండస్ట్రీ లోనే ఒక గొప్ప సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని అంటారు. బాహుబలి సినిమాతో ప్రపంచమంతా ఫేమస్ అయ్యాడు ఈ జక్కన్న. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్ళి పట్టాలు ఎక్కారు. గతంలో రాజమౌళి ఎన్టీఆర్, రాం చరణ్ లకి భారి హిట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు(ఆర్ఆర్ఆర్) సంబంధించి 2 రోజులుగా ఒక స్టోరీలైన్ ఫిలిం సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో దాదాపు 2 పేజీల కథ తిరుగుతోంది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ దాంట్లో ఇలా అంతా విడమర్చి ఉంది.  దీంతో ఎక్కువ మంది ఇదే అసలైన ఆర్ఆర్ఆర్ కథ అనుకుంటున్నారు. పైగా ఆల్రెడీ రిలీజైన ఎన్టీఆర్, చరణ్ టీజర్లలోని విజువల్స్ కు ఈ కథకు అక్కడక్కడ పోలికలు కూడా మ్యాచ్ కావడం ఆ కథ నిజమే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు.

అయితే ఇలాంటి భారి ప్రాజెక్ట్ లా గురించి పుకార్లు వస్తూ ఉంటాయి కాబట్టి దీని గురించి ఆర్ఆర్ఆర్ యూనిట్ లైట్ తీసుకుంది. కానీ ఈసారి ఈ పుకారును ఖండించే బాధ్యతను మెగా ఫ్యాన్స్ తీసుకున్నారు. నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథకు ఆర్ఆర్ఆర్  సినిమాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు.అయితే చాల  ఆశ్చర్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ కథను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. అలా వైరల్ అవుతున్న కథ ఏంటంటే  “సీతారామరాజు అంటే రామ్ చరణ్ బాగా చదువుకుంటాడు. బ్రిటిషర్ల రూలింగ్ లో, వాళ్లకు అనుకూలంగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ, సక్రమంగా లీగల్ పద్ధతుల్లో దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ భీమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కేవలం యుద్ధంతోనే స్వతంత్రం వస్తుందని నమ్ముతాడు. అతను తన తండా జనాలకు యుద్ధరీతులు నేర్పుతూ, గొరిల్లా దాడులతో ఇండియాకు స్వాతంత్రం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఒక దశలో కొమరం భీమ్ ను రామ్ చరణ్ అరెస్ట్ చేస్తాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో సీతారామరాజు-భీమ్ కలిసి ఎలా బ్ర్టిటిష్ వారితో యుద్ధం చేసారు” అన్నదే మిగతా కథ అను తెలుస్తుంది. అలాగే సినిమాలో ఒక చిన్న పాప ఎపిసోడ్ కూడా బాగా హైలైట్ గా ఉంటుంది అని తెలుస్తుంది. మరి ఇలాంటి పుకార్ల గురించి ఒక క్లారిటీ రావాలంటే ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ రావలిసిందే.

Related posts

Ram Charan joins Chiranjeevi’s Acharya

cinemarascals

SAI DHARAM TEJ COMPLETES 6 YEARS IN TFI

cinemarascals

Beautiful ANANYA PANDEY

cinemarascals

Leave a Comment