ఆ తమిళ రీమేక్ లో రామ్??


టాలీవుడ్ లో అసలే. హిట్ సినిమాలు లేక హీరోలు దర్శకులు అల్లాడి పోతున్న తరుణంలో
సరైన కథ ఎక్కడ దొరకుతుందా అన్న వేట విపరీతంగా సాగుతోంది. ఈ మధ్య ఎక్కువగా ఫ్లాప్ లలో వున్న హీరో రామ్ కోసం ఈ వేట ఇంకా ఎక్కువగా సాగుతుంది. అయితే ఈ వేట ఆగిందని లేటెస్ట్ గా ఓ తమిళ సినిమా హక్కులను హీరో రామ్ కోసం కొన్నారని వార్తలు వస్తున్నాయి. థ డ మ్ ఈ మధ్యనే తమిళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయింది ఈ సినిమా. చిన్నా చితకా విలన్ వేషాలు వేస్తూ ఈ మధ్య మణిరత్నం నవాబ్ లో ఒక పాత్ర పోషించిన అరుణ్ విజయ్ హీరో. చాలా చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి కలెక్షన్లు నమోదు చేస్తోంది. సినిమా టోటల్ బిజినెస్ అక్కడ 15 కోట్లకు పైగా జరిగిందట.హీరో డబుల్ రోల్ చేసిన ఈ సినిమా ఇద్దరు లవర్స్ కథతో మాంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంట తమిళ్ లో ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

దాంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ జనాల కన్ను ఈ సినిమా మీద పడింది. ఇప్పడు ఈ సబ్జెక్ట్ ను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత స్రవంతి రవికిషోర్.దానికోసం కాస్త గట్టిపోటీ ఎదుర్కోనే ఆయన ఈ సినిమా హక్కులు సాధించారు అని తెలుస్తుంది. ఈ మేరకు దాదాపు మంచి డీల్ తమిళ సినిమా నిర్మాతలతో సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లవ్ స్టోరీ లు మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు చేసిన హీరో రామ్ ఈ సినిమాతో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ టచ్ చేయబోతున్నాడని అనుకోవాలి.

ఇదిలా వుంటే ఇదే ప్రాజెక్టు కోసం పోటీపడిన మరో నిర్మాత టాగోర్ మధు కూడా ఇప్పుడు ఇందులో భాగస్వామిగా వుంటారు. అంటే రవికిషోర్, మధు కలిపి రామ్ హీరోగా ఈ సినిమాను నిర్మిస్తారన్నమాట. ప్రస్తుతం ఓ సినిమాను పూరి జగన్నాధ్ డైరక్షన్ లో చేస్తున్న రామ్, దాని తరువాత ఈ సినిమా మీదకు వస్తారు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజే అన్నీ చెప్తారట!!

Tue Mar 12 , 2019
బాహుబలి అనే సినిమాతో ఒక రేంజ్ కు వెళ్లిపోయిన దర్శకుడు రాజమౌళి… ఆయన తన సినిమాలకు పాటించే విధానాలు అన్నీ చాలా వైవిధ్యంగా వుంటాయి. తాను అఫిషియల్ గా రిలీజ్ చేయించే వరకు సినిమాకు సంబంధించిన ఏ వివరాలు కూడా బయటకు రానివ్వరు. ఎంతో గుట్టుగా పనులు చేస్తారు. పైగా ఆయన సినిమా పనులు చేసేది అంతా ఆయన కుంటుంబ సభ్యులే కాబట్టి ఎలాంటి లీక్ లు అయ్యే అవకాశాలు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: