ఆ సినిమాకు టైటిలే కష్టంగా మారింది

యూత్ ఫుల్ హీరో శర్వానంద్ మాంచి డిఫరెంట్ సినిమాలు తీస్తాడనే పేరున్న దర్శకుడు  సుధీర్ వర్మ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త  సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా లో శర్వానంద్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని ఒక సామాన్య యువకుడు ఒక పెద్ద మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు అనేది చిత్ర కథ అని రూమర్లు వినిపిస్తున్నాయి. 
అయితే ఈ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులు కావడం సినిమా కు సంబంధించి ఇంత వరకు ఏది రిలీజ్ చేయకపోవడంతో ఎలాగైనా మా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలి అని చిత్ర వరగాలు ఓ ఫస్ట్ లుక్ లాంటిది రెడీ చేసి వదులుదామనుకున్నారట కానీ సినిమాకు ఇంత వరకు ఒక టైటిల్ అంటూ ఏదీ అనుకోకపోవడం తో ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ కాస్త ఇప్పుడు ఓ తల నొప్పి వ్యవహారం లా మారిందట. పోనీ టైటిల్ లేకుండా ఫస్ట్ లుక్ వదులుదాం అనుకుంటే సినిమాకు అనుకున్నంత బజ్ రాదేమో అని బెంగట అయింది. పోనీ ఈ  ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేద్దాం అనుకుంటే ఇప్పటికే చాలా లేట్ అయినదని ఇంకా లేట్ చేస్తే మనకే నష్టం అనుకుంటున్నారట.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఒక్క మాఫియా డాన్  ఎపిసోడ్ కోసమే  హైదరాబాద్ శివార్లలో కోటి రూపాయల ఖర్చుతో భారీ సెట్ వేశారట.
తనకు పోటీగా ఉన్న యూత్ హీరోలంతా ఫాస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే శర్వానంద్ మాత్రం కొంచం వెనక పడ్డాడు. తాను ప్రస్తుతం చేస్తున్న పడి పడి లేచే మనసు  ఈనెల 21న ఇది థియేటర్లలోకి వస్తుంది. ఆ వెంటనే సుధీర్ వర్మ-శర్వానంద్ సినిమా రిలీజ్ అవుతుంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

మరీ ఆ సెక్సీ భామ తోనా??

Thu Dec 13 , 2018
బాలీవుడ్ లో బాగా బోల్డ్ గా ఉండే హీరోయిన్ ల పేర్లు చెప్పమంటే ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండే ముద్దుగుమ్మ ఈషా గుప్తా. అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా హాట్ హాట్ కిస్ సీన్స్ లో, బోల్డ్ ఫోటో షూట్స్ లో మీతి మీరి రెచ్చిపోవడం ఈ భామకు ఎక్సపోసింగ్ తో పెట్టిన విద్య.  హిందీ హీరోయిన్ ల గురించి కాస్త అవగాహన ఉన్న ఎవరైనా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: