ఆ సినిమాలకు పండగలతో పని లేదంట

ఆ సినిమాలకు పండగలతో పని లేదంట


బాహుబలి, సోను కి టు టు కి స్వీటీ, రాజి, సంజు, స్త్రీ, యురి ద సర్జికల్  స్ట్రైక్ ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి వందల కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టినవే. మనం ఇప్పుడు ఈ సినిమాల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే సినిమా రిలీజ్ టైమింగ్ అనేది చాలా ముఖ్యమని ఆ టైం ను బట్టే సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయని  అంటుంటారు. అయితే ఈ సినిమాలు విడుదలైనప్పుడు ఏలాంటి పండగలు గాని పబ్లిక్ హాలి డే లు గాని లేకపోయినా కూడా ఇవి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి దానికి కారణం ఈ సినిమాలన్నింటిలో కొత్త కథ కథనాలు ఉండడమే. ఇలా గా వస్తున్న సినిమాల కంటే కొంచెం భిన్నంగా సామాన్య ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా ఈ సినిమాలు ఉన్నాయి. కథాకథనాలు కొత్త గా ఉంటూనే ప్రజలకు కావలసింది ఈ సినిమాల ద్వారా ఆయా దర్శక నిర్మాతలు అందించారు దాంతో సగటు సినీ ప్రేమికుడు ఈ సినిమాలను బంపర్ హిట్ చేశాడు.
ఇంత పెద్ద స్టార్లతో తీసిన సినిమా అయినా లేదా ఒక మామూలు చిన్న సినిమా అయినా పండుగల సీజన్లో రిలీజ్ అయితే కచ్చితంగా దాని హిట్ పర్సంటేజీలు చాలా ఎక్కువ శాతం ఉంటాయని సినిమా ఇండస్ట్రీలో బలంగా నమ్ము తుంటారు. అందుకే పెద్ద హీరోల సినిమాల దగ్గర నుంచి మొదలుకొని కొత్త వాళ్లతో తీసిన సినిమాలను కూడా పండుగల వేళ రిలీజ్ చేయడానికి చాలా ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా సంక్రాంతి దసరా దీపావళి క్రిస్మస్ రంజాన్ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఇలా ఏ సెలవు దినాలు దొరికితే ఆ సెలవు దినాల్లో సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని కలలు కంటుంటారు. ఆయా సమయాల్లో సినిమా విడుదలవడం తమకు బాగా ప్లస్సవుతుందని సెలవుదినం కావడంతో ఆ రకంగా సినిమా థియేటర్ కు వస్తాడని  వారి ప్రగాఢ నమ్మకం. మన భారతీయ సినిమాలో ఈమధ్య చూసుకుంటే కచ్చితంగా ప్రేక్షకుడు అభిరుచి మారుతుంది అది ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా దాంట్లో కథాకథనాలు సరిగ్గా లేకపోతే ఆ సినిమాలను ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. అదే ఎలాంటి గుర్తింపు లేని ఒక సాధారణ చిన్న ప్రాంతీయ సినిమాని కూడా కథ కథనాలు బాగుంటే అద్భుతంగా ఆదరిస్తున్నారు. అంటే ఈ ట్రేడ్ పండితులు సినిమా వర్గాలు నమ్ముతున్నట్లుగా  పండుగలకు సెలవు దినాలకు సినిమాలను రిలీజ్ చేయడం ద్వారా హిట్ ను అందుకోలేరు ఆయా సినిమాల లో మంచి కథా కథనాలు ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేసే సబ్జెక్ట్ లాంటివి ఉంటేనే వాటిని ఆదరిస్తారని చాలాసార్లు ప్రూవ్ చేశారు.
బాహుబలి 1 & 2


భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి సినిమాల సీరీస్ విడుదలైనప్పుడు కూడా ఎలాంటి సెలవు దినాలు పండుగ సీజన్ లేదు. అయినా కూడా బాహుబలి సినిమాలో ఉన్న కథాకథనాలు కొత్తదనం అమితంగా ఆకట్టుకుని ఆ సినిమా అత్యంత భారీ విజయాన్ని నమోదు చేయడానికి కారణం అయ్యాయి. రెండు పార్టులుగా వచ్చిన బాహుబలి సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందంటే ఆ సినిమాల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆఖరికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఎన్నికల ప్రచారంలో నేను కట్టప్ప లాంటి వాన్ని అని బాహుబలి సినిమా గురించి మాట్లాడారు. సినిమాలో నటీనటుల ప్రతిభ కథ కథనం అద్భుతమైన విజువల్స్ గ్రాఫిక్స్ సంగీతం ఇవన్నీ బాహుబలి సినిమా అద్భుతమైన విజయానికి దోహదం చేశాయి. ఈ పండుగ సీజన్ ను నమ్ముకోకుండా తమ సినిమా లో అద్భుతమైన కథ ఉందా లేదా అని ఆ సినిమా మేకర్స్ ఆలోచించడం వల్లనే ఇంతటి పెద్ద విజయాన్ని ప్రేక్షకుల దగ్గర నుంచి అందుకోవడం జరిగింది.
సోను కి టు టు కి స్వీటీ


దాదాపుగా కొత్తవాళ్లతో అసలేమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఏ పండుగ సీజన్ కు కూడా దీన్ని రిలీజ్ చేయకుండా తమ సినిమాలో ఉన్న కంటెంట్ ను నమ్ముకుని రిలీజ్ చేయడం ద్వారా దర్శక నిర్మాతలు ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. హిందీ సినిమాగా అయినప్పటికీ ఈ సినిమా ఇండియాలో దాదాపు ప్రతి స్టేట్ లో బాగా ఆడింది. ఈ సినిమా డైరెక్టర్ ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా ఒక చిన్న సింపుల్ కథను తీసుకుని దాన్ని అద్భుతమైన కథనంతో ప్రేక్షకులకు చెప్పడం ద్వారా తాను అనుకున్న విజయాన్ని సాధించగలిగాడు.
రాజీ


1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలవ్వడానికి జరిగిన కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలియా భట్ విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలలో నటించారు. తన దేశం కోసం ఒక సాధారణ భారత యువతి ఎలాంటి త్యాగం చేసింది తన జీవితంలో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంది అన్న కథనాన్ని భారత సినీ ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. రాజీ అనే సినిమాలో ఉన్న కథాకథనాలు సగటు ప్రేక్షకుడికి ఎంత కొత్తగా అనిపించాయి అంటే మా చూసిన ప్రతి ఒక్కరు కథ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిజానికి ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా గట్స్ కావాలి. ఒకవేళ ఇలాంటి సినిమాల్లో ఎవరైనా పెద్ద హీరోలని నటించమని అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అలాంటిది చాలా రిస్కు చేసి ఇలాంటి సినిమా తీసినందుకు ఈ సినిమా దర్శక నిర్మాతలు దగ్గర నుంచి గొప్ప విజయాన్ని అందుకున్నారు. రాజీ కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
సంజు


ప్రముఖ బాలీవుడ్ నటుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా మున్నాభాయ్ ఎంబిబిఎస్, త్రీ ఇడియట్స్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు రాజు హిరాణి తీసిన చిత్రం సంజు. రనబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో అద్భుతంగా ఈ సినిమాలో నటించాడు. తన జీవితంలో సంజయ్ దత్ ఎదుర్కొన్న కష్టాలు కన్నీళ్లు వివాదాలు వీటన్నిటిని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించిన రణబీర్ కపూర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సమ్మోహన పరిచాడు. ఈ సినిమా మీద రిలీజ్ ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నప్పటికీ విడుదలైన తర్వాత ఈ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. దాదాపుగా 600 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే దీని రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

స్త్రీ


గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా దాదాపు 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. అలా అని ఈ సినిమాలో ఎలాంటి పెద్ద స్టార్స్ లేరు రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ లాంటి చిన్నచిన్న స్టార్స్ తో ఈ సినిమాని నిర్మించారు. కానీ ఈ సినిమాకు ఎంచుకున్న కథ కథనాలు హారర్ కామెడీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి ఇంతటి ఘన విజయాన్ని అందించారు. 1990 సమయంలో భారతదేశంలోని కొన్ని గ్రామాల్లో ఓ స్త్రీ రేపు రా అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా కథని తీసుకొని దానికి అద్భుతమైన స్క్రీన్ప్లే తోడు చేసి సగటు సినీ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఎంజాయ్ చేసేలా తీయడమే ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణం. దాదాపుగా ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా అద్భుతంగా ఆడింది కొన్ని చోట్ల సినిమాకు రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చారు. చిన్నదా పెద్దదా అని కాదు దానిలో విషయం ఉందా లేదా అనే పాయింటే ఇక్కడ కూడా ప్రూవ్ అయింది.
యురి ద సర్జికల్  స్ట్రైక్ 


ఎప్పుడూ మనల్ని దొంగదెబ్బ తీసే పాకిస్తాన్ మీద సడన్ గా  విరుచుకుపడి దాడులు చేసిన నిజ జీవిత కథే ఈ యురి ద సర్జికల్  స్ట్రైక్  సినిమా ఇతివృత్తం. 2016 లో భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు మన భారత సైనికులు అనూహ్యంగా పాకిస్థాన్ తీవ్రవాద శిబిరాల మీద దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. శాంతి కాముక దేశంగా ఎప్పుడు శాంతినే కోరుకునే భారతదేశం ఇలాంటి చర్యలకు దిగడం ప్రపంచం మొత్తం విస్తుపోయేలా చేసింది. శత్రువు ప్రతిసారి తమని రెచ్చగొడుతూ దొంగ దెబ్బతీస్తుంటే మేం చేతులు ముడుచుకుని కూర్చోమని  భారత్ తన శత్రుదేశాలకు పరోక్షంగా ఒక గొప్ప హెచ్చరిక జారీ చేసేలా ఈ సంఘటన జరిగింది. ఈ సంవత్సరం 2019లో బాలీవుడ్లో ఇదే ఇతివృత్తంతో యురి ద సర్జికల్  స్ట్రైక్ అనే సినిమా రిలీజ్ అయింది. సినిమాకు మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా అద్భుతమైన కథ కథనాలు ఉన్నాయని మంచి పాయింట్ తో సినిమా తీశారని ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజు కంటే మూడు రోజు కలెక్షన్లు డబుల్ గా ఉండడం ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. రెగ్యులర్గా వచ్చే మాస్ మసాలా సినిమాలు లేకపోతే లవ్ స్టోరీలు కన్నీటిని చూసి మొహం మొత్తిన సగటు సీనీ ప్రేమికుడు యురి ద సర్జికల్  స్ట్రైక్  లాంటి సినిమాలను చూసి తన దేశం గురించి గొప్పగా తెలుసుకుని తన దేశం గురించి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. 
అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న లేదా ప్రేక్షకుడిలో దేశభక్తిని రగిలిస్తునో లేకపోతే ఒక ఆలోచన రేకెత్తి స్తేనో అలాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బూతు సినిమాలకు రెగ్యులర్ ఫార్మాట్లో వస్తున్న సినిమాలకు ప్రేక్షకుడు ఎప్పుడో గుడ్ బై చెప్పేశాడు. తాను చూడాలనుకుంటున్న సినిమాలో మంచి కథ కథనాలు ఉన్నాయా లేదా నటీనటుల ప్రతిభ అద్భుతంగా ఉందా లేదా సినిమా చూస్తే తన లో ఏదైనా ఆలోచన మొలకెత్తుతున్న లేదా తనను ఉత్తేజపరుస్తుందా అన్న విషయాలను నేటి ప్రేక్షకులు పరిగణలోకి తీసుకొని సినిమాలకు వెళ్తున్నాడు. మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వచ్చిన కొన్ని బడా హీరోలసి నిమాల టీచర్లతో ట్రైలర్ తో జనాలను మోసం చేసినా సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే ఆ దేవున్ని కలెక్షన్లు లేక వెలవెలబోయాయి.  ఇప్పుడు రోజులు మారాయి ఇక మీదట మా సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో గ్రాఫిక్స్ ఉన్నాయి అంటే ఆ సినిమాను ఏ ప్రేక్షకుడు కూడా చూడడం లేదు. అదే మా సినిమాలో మంచి కథ కథనాలు ఉన్నాయి అంటే ఆ సినిమా ఎలాంటి చిన్న సినిమా అయినా తక్కువ థియేటర్ల లలో రిలీజ్ అయినా కూడా దాన్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ చూస్తున్నారు. చాలా చిన్న సందేశమే అయినా సినిమాల జయపజయాలతో చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని ఇప్పటికైనా సదరు సినిమాల దర్శక నిర్మాతలు హీరోలు తెలుసుకుని ఇక నుంచి కథాబలం ఉన్న సినిమాలు అందిస్తారని ఆశిద్దాం.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రజనీ కాంత్ పోయస్ గార్డెన్స్ ఫొటోస్

Tue Jan 15 , 2019
రజనీ కాంత్ పోయస్ గార్డెన్స్ ఫొటోస్ https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: