ఆ సినిమా కు 15 ఏళ్లు !!!!

సినిమా కు 15 ఏళ్లు !!!!

                                              Image Credit From Imdb.com respectively

మన్మధుడు తెలుగులో పదిహేనేళ్ల క్రితం వచ్చిన సినిమా ఇప్పటికీ టీవీ చానల్స్ లో వచ్చిన ప్రతి రోజు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడి చూస్తారు. ఇప్పుడు ఉన్న టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన సినిమాకి  విజయభాస్కర్ దర్శకుడు. నాగార్జున, సోనాలి బింద్రే హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సీనియర్ హాస్య నటులు బ్రహ్మానందం యాం లవంగం ఫ్రమ్  ప్యారిస్ అని సినిమాలో చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.
అమ్మాయిల్లో హ్యాండ్సమ్ హీరో గా మంచి పేరు ఉన్న నాగార్జునతో మన్మధుడు అనే టైటిల్ పెట్టి సినిమా చేయడం అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాలో నాగార్జున హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, డైలాగ్ డెలివరీ అన్నిటికీ చాలా పేరు వచ్చింది. ఇక సినిమా లో ఉన్న అన్ని పాటలు మ్యూజికల్గా పెద్ద హిట్ అయ్యాయి. అటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మంచి కామెడీ లవ్ స్టోరీ ఉన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తను అందించిన కథ లలో కమర్షియల్గా  మంచి విజయాన్ని నమోదు చేసుకున్న సినిమాల లిస్ట్  లో మన్మధుడు అనే సినిమా ముందు వరుసలో ఉంటుంది.   వాట్ ఉమెన్ వాంట్ అనే ఇంగ్లీషు సినిమాకి సినిమా రీమేక్ అని చెప్పుకుంటారు.అయితే అప్పట్లో మన్మధుడు సినిమాకి సీక్వెల్గా మన్మధుడు 2 అనే సినిమా తీస్తే దాంట్లో నటించాలని ఉందని హీరో నాగార్జున స్వయంగా చెప్పారు మరి భవిష్యత్తులో సినిమా ఏమైనా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

పెట్టా మూవీ స్టిల్స్

Fri Dec 21 , 2018
పెట్టా మూవీ స్టిల్స్ Image credit from official twitter account of sun pictures respectively https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: