ఇక అరాచకమే… కేజీఎఫ్ పార్ట్ 2 మొదలైంది!!


కేజీఎఫ్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ కన్నడ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తో హీరో యష్ రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయాడు. వ్యాప్తంగా ఈ సినిమాకు సినిమా హీరోకి అభిమానులు ఏర్పడ్డారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమాను పెట్టినప్పటినుంచి దానికి ఇంకా ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ మొదలు కాబోతుంది. సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు బెంగళూరులో లాంఛనంగా ప్రారంభం అయ్యాయి.

తెలుగు లో విజయవంతమైన సినిమాలు నిర్మించిన సాయి కొర్రపాటి ఒక నిర్మాతగా ఈ సినిమాకి వ్యవహరించబోతున్నారు. పార్ట్ 1 కు కొనసాగిం కొనసాగింపుగా రాబోతున్న ఈ సినిమా మీద అటు మా వర్గాల్లో ఇటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సైతం ఈ చిత్రం మొదటి భాగాన్ని ఎంతో పొగిడారు. కే పార్ట్ 1 పాటలు మ్యూజిక్ డైలాగ్స్ చాలా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. సినిమాలో చూపించిన హీరోఇజం కానీ ఫైట్స్ లు కానీ మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను ఈ సినిమాకు సంపాదించిపెట్టాయి. పార్ట్ 1 చూసిన వాళ్ళు అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం అవుతుంది అంటే అతిశయోక్తి అనిపించక మానదు. సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో తెచ్చుకున్న సినిమా బాహుబలి తర్వాత ఇది అని చెప్పవచ్చు.

ఈ సినిమా హీరోయిన్ విషయానికి వస్తే ఒక సాధారణ డ్రైవర్ కొడుకు అయిన యశ్ ముందుగా చిన్న చిన్న కన్నడ సీరియల్స్ లో నటుడిగా తన కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో హీరోగా నిలదొక్కుకున్నాడు. చిత్ర పరిశ్రమలో ఒక రేంజ్ కు తీసుకువెళతాయి అన్న బలమైన సంకల్పం తో తాను ఈ సినిమాను మొదలు పెట్టానని గంగా కన్నడ సినీ ఇండస్ట్రీ ని అత్యున్నత స్థాయిలో నిలపడమే తన జీవితాశయమని ఈ సందర్భంగా యశ్ చెప్పారు. లాంటి సినిమాతో భారత దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను యశ్ సంపాదించుకున్నాడు. 2020 సమ్మర్ కానుకగా కే జి ఎఫ్ పార్ట్ 2 సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

కే జి ఎఫ్ పార్ట్ 2 మూవీ ఓపెనింగ్ ఫొటోస్

Wed Mar 13 , 2019
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: