ఈ సంక్రాంతి విజేత ఎవరు??

ఈ సంక్రాంతి విజేత ఎవరు??

                                                   image credited from youtube.com

సంక్రాంతి… తెలుగునాట ఇది అతి పెద్ద పండుగ. దాదాపు మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ తెలుగు పండుగలలో అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వాళ్ళు చాలా ఘనంగా దీన్ని జరుపుకుంటారు. అయితే ఈ పండుగకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుంది. సంక్రాంతికి తన తమ సినిమాలను రిలీజ్ చేసుకోవడం అంటే తమ పంట పండినట్లే అని సదరు దర్శక నిర్మాతలు హీరో లు ఫీలవుతుంటారు. సినిమా బాగుందనే టాక్ వస్తే దాదాపు పది రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద తమ చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుందని వారి నమ్మకం.

తెలుగులో పెద్ద హీరోలు అనదగ్గ వారందరూ దాదాపుగా ఈ సంక్రాంతి సక్సెస్ రుచి చూసిన వాళ్ళే. మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఇలా తెలుగు లో ఉన్న పెద్ద హీరోలు అందరూ తమ తమ చిత్రాలతో సంక్రాంతికి భారీ హిట్లు సాధించి తమ క్రేజ్ను పాపులారిటీని పెంచుకున్న వాళ్లే. కొన్నేళ్ల క్రితం అయితే సంక్రాంతి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆయా హీరోల ఫ్యాన్స్ మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలు నడిచేవి మా హీరో సినిమా కలెక్షన్ల ఎక్కువగా వచ్చాయంటే లేదు మా హీరో సినిమా ఎక్కువగా కలెక్షన్లు సంపాదించింది అని ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ తమ హీరోల కోసం ఫ్యాన్స్ కొట్టుకునే వాళ్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అలాంటి సంఘటనలు జరగకున్నా ఇప్పటికీ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే కలెక్షన్ల విషయంలో వాళ్ళ ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమాలో మాత్రం పోటీ చాలా రసవత్తరంగా ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితచరిత్రని ఆయన కొడుకు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాగా
తీస్తుండటంతో దీని మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. రంగస్థలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ నవత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న మరో చిత్రం వినయ విధేయ రామ మాస్ సినిమాలను అద్భుతంగా తీస్తాడని పేరున్న బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెంచేసింది. పాటలు కూడా ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ మేకోవర్ చాలా కొత్తగా ఉంది. ఇకపోతే విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి నటిస్తున్న F2 సినిమా కూడా సంక్రాంతి బరి లో దిగుతుంది. మంచి కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు తీస్తాడనే పేరున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాల గురించి  విశ్లేషించాల్సి వస్తే
ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన సినిమా

ఎన్టీఆర్ బయోపిక్:

                                                        image credited from Mirchi9.com                                             
తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ ఒక సామాన్య పేద రైతు కుటుంబం నుంచి వచ్చి సినిమాల్లో కథానాయకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచలంచలుగా ఎదిగి తెలుగు ప్రజల్లో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటుడు ఎన్టీఆర్ , నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన తెలుగు ప్రజల కోసం ఏదైనా చేయాలని తన రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి చలించి రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీ పెట్టి ఎన్నికలలో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఘనచరిత్ర ఎన్టీఆర్ది. తెలుగువాళ్లందరికీ ఎన్టీఆర్ సినిమాల గురించి ఆయన రాజకీయ జీవితం గురించి చాలా వరకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా లో తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ విషయాల గురించి ఆయన సినిమాల్లో రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు ఆయన జీవిత ప్రస్థానం ఏంటి మొదటి భార్య బసవతారకంతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాల గురించి ఇంకా ఎన్టీఆర్ గురించి సామాన్య ప్రజలకు తెలియని చాలా ముఖ్యమైన విషయాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు. దాంతో సగటు ప్రేక్షకుడిలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సంక్రాంతికి తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చూడటానికి వెనుకాడబోరని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు.

ఎన్టీఆర్ తన సినీ జీవిత ప్రస్థానంలో ఎన్నో ఎన్నో గొప్ప పాత్రలు వేశారు, రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనునిగా రావణాసురుడిగా వేసిన పాత్రలు జనం బ్రహ్మరథం పట్టారు. సాంఘిక జానపద పౌరాణిక ఇలా ఎన్టీఆర్ చేయని పాత్ర అనేది లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ తన సినిమాల్లో వేసిన అత్యంత ముఖ్యమైన పాత్రల్ని పోషిస్తున్నారు.ఇప్పుడు ఆయా పాత్రల్లో నందమూరి బాలకృష్ణ నటన ఎలా ఉంటుందని కూడా మంచి ఇంట్రెస్టింగ్ విషయంగా మారింది.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా ఎన్టీఆర్ అభిమానులలో సగటు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. రెండు పార్ట్ లుగా రానున్న ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు అనే పేరుతో తీస్తూ దీంట్లో ఎన్టీఆర్ తను మొదటిగా సినిమాల్లోకి వచ్చి అక్కడ ఎలా నిలదొక్కుకున్నారు ఎలా ఒక అద్భుతమైన నటుడిగా ఎదిగారు అనే విషయాల్ని చూపించబోతున్నారు. రెండోపార్ట్ విషయానికి వస్తే దానిని ఎన్టీఆర్ మహానాయకుడు అనే పేరుతో విడుదల చేయబోతున్నారు ఈ భాగంలో ఎన్టీఆర్ ఎలా తన ప్రజల అవస్థలు, కష్టాలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు ఆయన ఎలా పార్టీ పెట్టారు ఎలా ఎన్నికల్లో గెలిచారు అని ఇలా చాలా ముఖ్యమైన సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల అవుతుండగా ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 25వ తారీకున విడుదల చేయనున్నారు.

వినయ విధేయ రామ:


                                                   image credited from english.tupaki.com

2018 లో రంగస్థలం అనే సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తో మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. భారీ మా సినిమాలు తీస్తాడనే పేరున్న బోయపాటి శ్రీను ఈ సినిమాలో రామ్ చరణ్ అంగ్రీ యంగ్ మ్యాన్ గా చూపించబోతున్నారు. తమిళ్ హీరో ప్రశాంత్ రామ్ చరణ్ కు అన్నయ్యగా నటిస్తున్నారు. అదే విధంగా ప్రముఖ దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ కొడుకు ఆర్యన్ రాజేష్ కూడా రామ్ చరణ్ కి అన్నగా నటించారు. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, కమెడియన్స్ అందరూ ఉన్న ఈ సినిమా సంక్రాంతికి తెలుగు వారందరికీ ఫుల్ మీల్స్ లాంటిదనే చెప్పాలి. మంచి కథా, కథనాలు కుదిరితే తను ఎంత పెద్ద హిట్ కొట్టగలడు అనేది రంగస్థలం సినిమాతో రాంచరణ్ ప్రూవ్ చేసుకున్నాడు.

ఇప్పుడు వినయ విధేయ రామ సినిమాకు ఏ మాత్రం బాగుందనే టాక్ వచ్చింది మళ్ళీ రామ్ చరణ్ పెద్ద హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో తమిళ్ హీరో ప్రశాంత్ పాత్ర చాలా కీలకమైనది గా తెలుస్తుంది.  ప్రశాంత్ పాత్ర ఒక ఎన్నికల అధికారి అని బీహార్ రాష్ట్రంలో ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన ప్రశాంత్ కి అక్కడ విలన్ వల్ల సమస్యలు ఎదురవుతాయని తన అన్నయ్యని కాపాడుకోవడానికి హీరో రంగంలోకి దిగుతాడు అనేది ఈ సినిమా కథ గా చెబుతున్నారు. మంచి ఫ్యామిలీ విలువలు సెంటిమెంట్ కూడా సినిమాలో బాగానే ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ సినిమా పాటలు బాగా హిట్ అయ్యాయి. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈనెల పదో తారీఖున విడుదల అవుతుంది.

F2.

                                                          image credited from gstatic.com
ఇక ఈ సంక్రాంతికి తోడల్లళ్లు కథతో అచ్చమైన తెలుగు సినిమా గా రాబోతున్న మరో చిత్రం F2. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకుడి గా వస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఇద్దరు తోడల్లళ్లు తమ భార్యల వల్ల ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది ఈ సినిమాలో ప్రధాన కథ గా ఉండబోతుంది. పటాస్ సుప్రీమ్ రాజా ది గ్రేట్ డి పూర్తి వినోదభరితమైన సినిమాలు అందించిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టే లాగానే కనిపిస్తున్నారు.

F2 లో కామెడీకి పెద్దపీట వేశారని వెంకటేష్ వరుణ్ తేజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా వరుణ్ తేజ్ కు జోడిగా మెహరీన్ నటించింది.బిసి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు  మార్కెట్లోకి రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి రోజున మంచి వినోదాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం బెస్ట్ ఛాయిస్ గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సంక్రాంతికి రిలీజవుతున్న ఈ మూడు సినిమాలు వేటికవే విభిన్నమైనవి. అన్ని సినిమాల మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి అయితే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమాను విజేతగా నిలబడతారనేది తెలియాలంటే మనం సంక్రాంతి పండుగ వరకు వేచి చూడాలి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి పాత్ర పోషిస్తున్న జగపతిబాబు

Thu Jan 3 , 2019
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి పాత్ర పోషిస్తున్న జగపతిబాబు                                                      Image credited from Twitter.com యాత్ర దివంగత జననేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: