
ఉపవాసం మానసిక,శారీరక ఆరోగ్యాలను మెరుగు పరుచుకోవడానికి చేస్తారు.మానసిక ఆరోగ్యం కోసం అయితే ఎవరో ఒక భగవంతుని ధ్యానం మీద మనసు లగ్నం చేయటానికి ,శారీరక ఆరోగ్యం కోసం అయితే ఎవరో ఒక వైద్యుని సలహా మేరకు నిర్ణీత సమయంలో వివిధ రకాల ఉపవాసాలు చేస్తారు.ఏ కోవకు చెందిన ఉపవాసం అయిన కడుపు మాడ్చుకొని తినాలనిపించిన ఆహారాన్ని తినొద్దని ఏ భగవంతుడు ఎక్కడ శాసించలేదు.తినొచ్చా,తినకూడద అనే సందేహంలో ఉన్నప్పుడు లేదా ఆకలి అనిపించినా బలవంతంగా ఉపవాసం చేసినపుడు మనసు ధ్యానం మీద లగ్నం అవ్వదు.మనసు స్థిమితం లేనప్పుడు మానసిక ప్రభావం ఎక్కువగా శరీరంపై మాత్రమే ఉంటుంది.అంటే మానసిక, శారీరక ఆరోగ్యం రెండు కూడా దెబ్బతింటాయి.ఇక వైద్యుని సలహా మేరకు ఉపవాసం చేయాల్సి వచ్చినపుడు వైద్యో నారాయణో హరి అని నానుడి కాబట్టి శారీరక ఆరోగ్యం కోసం పాటించాల్సిందే.ఇవేమీ కాక నామమాత్రముగా చేసే ఉపవాసం అయితే నిరభ్యంతరంగా నచ్చిన చాక్లెట్ తిని ఆనందించండి😀