ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య రివ్యూ మనసుల్ని తట్టిలేపే క్లాసిక్!!!

1

ఉమా మహేశ్వర ఉగ్ర  రూపస్య రివ్యూ మనసుల్ని తట్టిలేపే క్లాసిక్!!!

ఉమా మహేశ్వర ఉగ్ర  రూపస్య రివ్యూ రేటింగ్ :  4/5
కరోనా కారణంగా మరో తెలుగు సినిమా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మలయాళ సినిమా ‘మహిషింతే ప్రతీకారం’ అనే సినిమాకు ఆఫిషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళం సినిమాలో లైఫ్ ఉంటుంది అక్కడి పరిస్థితులు, జీవన విధానమే వారి సినిమా కథలుగా ఉంటాయి కానీ తెలుగులో దానికి కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది మరి ఈ మలయాళ రీమేక్ తెలుగులో కుదిరిందా లేదా చూద్దాం.
కథ : నిజానికి ఇది పెద్ద కథేమీ కాదు అరకులో ఒక చిన్న ఫోటో స్టూడియో నడుపుకునే ఉమా మహేశ్వర్ రావు(సత్య దేవ్) ఓ రోజు తన ఫోటో స్టూడియో ముందు జరిగిన గొడవను ఆపాలనుకోవడం అనుకోకుండా ఆ గొడవలో జోగి నాయుడు అనే వ్యక్తీ చేతిలో దెబ్బలు తిని, అందరి ముందు మళ్ళీ జోగి నాయుడును కొట్టే వరకూ చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు మరి ఉమామహేశ్వరరావు శపథం నెరవేరిందా లేదా? అతను జోగి నాయుడు మీద ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
ముందే చెప్పుకున్నట్టు మలయాళం సినిమాల్లో అక్కడి రెగ్యులర్ లైఫ్ నే సినిమాల్లో చూపిస్తుంటారు, తనను కొట్టిన ఒక వ్యక్తి మీద హీరో పగ తీర్చుకోవాలనుకోవడం చాలా చిన్న పాయింట్ కానీ అతని చుట్టూ ఉండే మనుషులు అతని లైఫ్ ఇవన్నీ తన పగ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఉమా మహేశ్వర్ రావు గా సత్య దేవ్ నటన చాలా బాగుంది ఒక చిన్న ఊరిలో తండ్రి వారసత్వంగా వచ్చిన ఫోటో స్టూడియో నడుపుతూ ఎవరితో గొడవలు పెట్టుకోని వ్యక్తిగా అద్భుతంగా నటించాడు తను ప్రేమిస్తున్న అమ్మాయి ఫోన్ చేసి కన్ఫ్యూషన్ అవుతున్నా అని చెపితే నీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయా అని అడగడం, ఆ అమ్మాయి పెళ్ళికి వెళుతున్నా అంటే తన ఊరి వాడికి లిఫ్ట్ ఇచ్చి తను కూడా ఆ పెళ్ళికి వెళ్ళడం, వేరొకరిని పెళ్ళి చేసుకున్న లవర్ ని చూసి మనస్పూర్తిగా నవ్వడం ఇవన్నీ తన స్వచ్చమైన మనసును తెలియచేప్పేవే అయితే పగ దగ్గరికి వచ్చే సరికి పట్టు వదలడు. దర్శకుడు వెంకటేష్ మహా మలయాళంలో హిట్ అయ్యి నటుడు ఫాహాద్ ఫాసిల్ కు మంచి పేరు తీసుకొచ్చిన ఈ సినిమాను రీమేక్ చేయడం అన్నది రిస్కే కానీ ఆ రిస్క్ ను ఆయన అవలీలగా దాటాడు, ముఖ్యంగా అరకు బ్యాక్ డ్రాప్ తీసుకోవడం అక్కడి ఆత్మను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. నాటు వైద్యం చేసే బాబ్జీగా నరేష్ కానీ అతని షాపులో పని చేయడానికి వచ్చిన కొర్రి సుహాస్ పాత్రలో సుహాస్ కానీ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు, ముఖ్యంగా తన కూతురుతో చనువుగా ఉంటున్నాడని సుహాస్ ను తిట్టి వెళ్లగొట్టే సీన్ లో ఇద్దరి నటన బాగుంది ఆడ పిల్లలతో మాట్లాడే ప్రతి మగాడు ఎధవే అని భ్రమపడే మనుషులు ఉన్నంత వరకు ఈ దేశం బాగు పడదు అన్న డైలాగ్ చెడుతో పాటు మంచీ ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇక పోతే ఈ సినిమాలో సత్య దేవ్ తర్వాత అంతగా ఆకట్టుకునే పాత్ర జ్యోతిగా చేసిన రూపా కొడువయుర్ ది ఆంధ్రజ్యోతి మ్యాగజైన్ కు ఫోటో దిగడానికి ఉమా మహేశ్వర్ రావు ఫోటో స్టూడియో కు వచ్చి తను తీసిన ఫోటో చూసి నీకు ఫోటోలు తీయడం వచ్చా అని అడుగుతుంది తన వృత్తిని మొక్కుబడిగా చేస్తున్న ఉమాను తట్టిలేపే పాత్ర ఇది, జ్యోతి ప్రశ్నకు సమాధానం వెతకడమే ఉమా మహేశ్వర్ రావు జీవితాన్ని మార్చేస్తుంది. కళంటే పాఠాలు చదివితే రాదు పరితపిస్తే వస్తుంది అని తండ్రి చెప్పే మాటలు విని మారిన ఉమా ప్రకృతిని, ఫోటోలలో ఉండే ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు తనకు ఫోటో తీయడం వచ్చా అని అడిగిన జ్యోతి ఫోటో స్వాతి మ్యాగజైన్ లో వచ్చేలా చేయడంతో అతనికి సమాధానం దొరుకుతుంది. జ్యోతి పాత్రలో రూపా కొడువయుర్ చాలా బాగా నటించింది ఆమె నటన సహజంగా ఉంది సినిమాలో తన పాత్ర ఏదో మన ఊరిలో మనకు తెలిసిన అమ్మాయా అనిపిస్తుంది రూపా తెలుగు సినిమాకు దొరికిన మరొక టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరో తండ్రిగా చేసిన మలయాళ నటుడు రాఘవన్ అద్భుతంగా నటించాడు ఆయన్ని చూస్తే జీవితంలో ఆన్నీ చదివిన ఒక యోగిలా కనిపిస్తాడు. పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతున్న తన లవర్ గురించి ఆలోచిస్తూ కొడుకు బాధ పడుతుంటే వెళ్ళిపోవాలనుకుంటున్న వాటిని వెళ్లనిస్తేనే మంచిది అని చెప్పే సీన్ లో ఉమా మహేశ్వరరావు పాత్ర బాధనా అన్నట్టు వర్షం మొదలవడం ఆ వర్షం వెలసి మళ్ళీ ఉమా పాత్రకు చిన్న స్వాంతన దొరకడం అన్నది విజువల్ గా దర్శకుడి ప్రతిభకు, సున్నిత భావాలకు అద్దం పడుతుంది సినిమాకు తను రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. తొలి చిత్రం c/o కంచరపాలెంతో తన ప్రత్యేకతను చాటి చెప్పిన దర్శకుడు వెంకటేష్ మహా మళ్ళీ ఇలాంటి సినిమాను తీసి తనొక డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ అన్న విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు, సినిమాలో  ఒక చిన్న పాత్రలో మెరిసి తనలోనూ మంచి నటుడు ఉన్నారనిపించారు. తను తీసిన తొలి సినిమా c/o కంచరపాలెం లో మంచి పాత్ర చేసిన నిర్మాత విజయ ప్రవీణ ఈ సినిమాలోనూ చిన్న పాత్రలో నటించింది. మిగాతా పాత్రల్లో అందరూ తమ తమ పరిధి మేర బాగానే నటించారు. ఇక ఒరిజినల్ సినిమా మహిషింతే ప్రతీకారంకు సంగీతం అందించిన బిజిబల్ ఈ సినిమాకు అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు పాటలు కానీ నేపథ్య సంగీతం కానీ సినిమా మూడ్ ను చాలా వరకు నిలబెట్టాయి అప్పు ప్రభాకర్ కెమెరా అరకును ఇంకా అందంగా చూపించింది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరగా :
సినిమా అనేది ఒక ఎంటర్ టైన్మెంట్ అనుకునే వారి చేత కూడా సినిమాలు జీవితాన్ని చూపిస్తాయి, జీవితంలో ఎలా బ్రతకాలో అన్నది నేర్పిస్తాయి అని ఫీలయ్యే విధంగా ఈ చిత్రం అనిపిస్తుంది. మాస్ మసాలా, లవ్ స్టోరీస్, కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందా అంటే అనుమానమే అయితే మనసుల్ని తట్టిలేపే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు రావడం కూడా ఒక విధంగా మంచిదే ఎందుకంటే మన జీవితాలని మనం ఒకసారి తరచి చూసుకునే అవకాశం ఇలాంటి సినిమాల ద్వారానే కలుగుతుంది.               

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

One thought on “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య రివ్యూ మనసుల్ని తట్టిలేపే క్లాసిక్!!!

Leave a Reply

Next Post

శకుంతలా దేవి హిందీ మూవీ రివ్యూ విద్యా బాలన్ షో!!!

Fri Jul 31 , 2020
శకుంతలా దేవి హిందీ మూవీ రివ్యూ విద్యా బాలన్ షో!!! శకుంతలా దేవి మూవీ రివ్యూ రేటింగ్ 3.5/5 ఇండియన్ మ్యాథ్స్ జీనియస్ శకుంతల దేవి రియల్ లైఫ్ ఆధారంగా తీసిన ఈ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. తన తెలివితేటలతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచి కంప్యూటర్నే ఓడించిన శకుంతల దేవి జీవితాన్ని ఆవిడ కూతురు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా ఇది, వరల్డ్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: