ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ – సినిమా రాస్కేల్స్


రేటింగ్: 2.75/5

ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ‘ఎన్టీఆర్ బయో పిక్ కథానాయకుడు – మహానాయకుడు’ వచ్చింది.. వెళ్లింది… కానీ ఏం లాభం అటు దర్శక నిర్మాతలకు ఇటు ప్రేక్షకులకు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారిని విపరీతంగా అభిమానించి ఆయన గురించి ఏదో గొప్పగా తీశారు చూసి తరిద్దాం అనుకున్న వాళ్ళకి ఇలా ఎవరికీ ఏం ఫలితం లేదు… ఒక గొప్ప వ్యక్తి జీవితం గొప్ప సినిమాగా అవ్వాల్సిన మంచి అవకాశం కూడా పోయింది. అసలు ఎన్టీఆర్ సిని జీవితంలో పెద్దగా కష్టాలు కన్నీళ్లు లేవు అలాగే భయంకర శత్రువులు ఎవరూ లేరు కాబట్టి ఆయన బయో పిక్ నీ ఏమాత్రం జనరంజకంగా గా తీయలేకపోయారు. మొదటి పార్ట్ ఏదో మిస్ ఫైర్ అయ్యింది పోనీలే రెండో పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ లో పెద్దాయన రాజకీయ జీవితం అద్భుతంగా చూపిస్తారు అని ఆశ పెట్టుకున్న వాళ్ళ ఆశలూ అడియాశలయ్యాయి. నిజం చెప్పాలంటే ఆయన వ్యక్తిగత జీవితం కన్నా రాజకీయ జీవితం లోనే ఎక్కువ డ్రామా, మలుపులు వెన్నుపోట్లు ఉన్నాయి.

క‌థ:

పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. రాజకీయంగా అవగాహన ఉన్న అందరికీ తెలిసి ఉన్న కథనే (ముఖ్యంగా 1970 నుంచి 1990 వరకు యూత్ లో ఉన్న వాళ్ళకు అయితే అసలు కొత్తగా అనిపించదు) టైటిల్స్ లోనే ఫస్ట్ పార్ట్ లో ఏం చెప్పారో ఒకసారి గుర్తు చేస్తూ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ‘తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నా’ అనే రాజ‌కీయ ప్ర‌క‌ట‌నతో ముగిసిన ‘క‌థానాయ‌కుడు’కు కొన సాగింపు మొదలవుతుంది. తన పార్టీకి సంబంధించిన గుర్తు రూపొందించి ఆ తర్వాత నందమూరి తారకరామారావు (బాలకృష్ణ) తన రాజకీయ ప్రచారం మొదలెడతారు. ఆంధ్రప్రదేశ్ అంతటా పార్టీ ప్రచారం ప్రారంభిస్తారు. ప్రజల తిరుగులేని మద్దతు తో అఖండ మెజార్టీతో పార్టీ ప్ర‌క‌ట‌న చేసిన 9 నెల‌లోపే అధికారంలోకి వస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, సంక్షేమ పథకాలు అమలు మొదలెడతారు. కిలో రెండు రూపాయిల బియ్యం, మహిళలకు ఆస్థి హక్కులో సమాన వాటా బాగా ప్రజల్లోకి వెళ్తాయి. ఇంకో ప్రక్క తన భార్య అనారోగ్యం ఆయన్ను బాగా బాధ పెడుతుంది భాధను బలం అయినా గా కూడా నమ్మినవి చేసుకుంటూ వెళ్ళిపోయే ముఖ్యమంత్రిగా బిజీ అయ్యిపోతారు. అయితే అదే సమయంలో భార్య బసవతారకం (విద్యాబాలన్) కాన్సర్ బారని పడ్డారని, హార్ట్ కు సంభందించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. దాంతో ఆమెను తీసుకుని అమెరికాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించటానికి తీసుకెళ్ళతారు. వెనక్కి తిరిగి వచ్చేసరికి వెన్నుపోటుకు తను గురి అయ్యారని తెలుసుకుంటారు ఎన్టీఆర్. అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్‌ బాగా నమ్మిన, ఆయన పార్టీకే చెందిన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడుస్తారు. ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాడి రాష్ట్రపతిని కలిసి తిరిగి రెండోసారి సీఎం‌గా ప్రమాణ స్వీకారం చేయడం వెనక జరిగిన కథేంటి..నాదెండ్ల భాస్కరరావు చేసిన నమ్మక ద్రోహం ఏమిటి..ఆ సమయంలో చంద్రబాబు పాత్ర ఏమిటి…అప్పటి కాంగ్రేస్ నిరంకుశ‌ పాలనకి ఎలా ఎన్టీఆర్ బుద్ది చెప్ప‌గ‌లిగారు అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఎన్టీఆర్‌ రాజకీయ జీవితానికి సంబంధించి పూర్తి చిత్రంగా దీన్ని చెప్పలేం. 1982 మార్చిలో ఆయన పార్టీ పెట్టింది మొదలు, 1984 ఆగస్టు సంక్షోభం, నాదెండ్ల నెలరోజులు సీఎం అవడం, అవిశ్వాసం తీర్మానం, తిరిగి ఎన్టీఆర్ సీఎం అవడం వరకే ఈ సినిమాలో చూపించారు. కానీ నిజానికి ఆయన రాజకీయ జీవితంలో కీలక మార్పులు, మలుపులు ఆ తర్వాతే ఉన్నాయనేది అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా చంద్రబాబుని హైలెట్ చేయటానికి తీసినట్లుగా అనిపిస్తుంది తప్ప ఎన్టీఆర్ ని రాజకీయ జీవితాన్ని సంపూర్ణంగా చూపిస్తున్నట్లు అనిపించదు. ముఖ్యంగా కాంగ్రేస్ పెద్దలతో తేల్చుకుంటానని ఎన్టీఆర్ డిల్లీకు వెళ్లినప్పుడు ఇక్కడ పార్టీని కాపాడుకోవటానికి చంద్రబాబు వేసే ఎత్తులు ఆసక్తికరంగా బాబు ని హీరో అని చూపించడానికి పెట్టినట్లుగా అనిపిస్తాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెదిరిపోకుండా చంద్రబాబు తన మైండ్ గేమ్‌తో కాపాడుకుంటూ వచ్చిన ఆయన టాలెంట్ కు ఎవరైనా శభాష్ అనాలపిస్తుంది. ఢిల్లీలో పోరాడుతున్న ఎన్టీఆర్ కు మద్దతుగా చంద్రబాబు వాళ్ళను ఢిల్లీకి తీసుకువెళ్లండం అక్కడ నుండి బెంగుళూరుకు తరలించడం లాంటి సీన్స్ తో చంద్రబాబు తెలుగు దేశం పార్టీ కోసం ఎంత పనిచేసారు అనిపిస్తుంది.

ముఖ్యంగా ట్రైన్‌లో టిడిపి ఎమ్మెల్యేలను ఢిల్లీ తరలిస్తున్నప్పుడు మధ్యలో వచ్చే సమస్యలను, అక్కడ తగిలే విలన్‌‌లతో చంద్రబాబు ఫైటింగ్‌కి దిగటం లాంటివి ఎవరు చూసినా ఆయన వల్లే పార్టీ నిలబడింది, బ్రతికి ఉంది,ఆయన పార్టీ కోసం మంచే చేసారు. అనే ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక చంద్రబాబు పాత్రలో రానా మేనరిజంతో పాటు వాయిస్‌ని ఇమిటేట్ చేసి ఆయన్ను దింపేసారు. అసలు ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బయోపిక్ గా కాకుండా సంక్షోభ సమయంలో చంద్రబాబు ఎల తన తెలివితేటలను పార్టీకి ఉపయోగించారు, ఎలా నిలబెట్టారు అనే పాయింట్ మీదే సినిమా తీసి ఉంటే ఇబ్బందే లేకపోయేది. ఎన్టీఆర్ బయోపిక్ అనిచెప్తూ కావాలని చంద్రబాబుని హైలెట్ చేయటం అన్నదే పెద్ద మైనస్ గా మారింది. ఇక ఫస్ట్ హాఫ్ పరుగెడితే, సెకండాఫ్ నత్త నడక నడిచింది. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లోలాగ సీన్స్ రిపీట్ కాలేదు చెప్తున్న విషయంపైనే దృష్టి పెట్టి ముందుకు వెళ్లిపోయారు. దాంతో చూస్తున్నంతసే తెలిసిన విషయాలే అయినా బోర్ అనిపించలేదు.

ప్లస్ పాయింట్స్:

బాల కృష్ణ
కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్:

స్టోరీ
స్లో నేరేషన్
NTR కథని పూర్తిగా చెప్పక పోవడం

ఫైనల్ రిజల్ట్:

NTR బయో పిక్ తీయకుండా ఉన్నా బాగుండేది.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కోడి రామకృష్ణ ఇక లేరు

Fri Feb 22 , 2019
ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ ఈ రోజు కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. ఆయన తీసిన అమ్మోరు దేవి దేవి పుత్రుడు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: