ఐకాన్.. కనబడుటలేదు -అల్లు అర్జున్

 ఐకాన్.. కనబడుటలేదు –అల్లు అర్జున్

నా పేరు సూర్య..తరువాత కొత్త ప్రాజెక్టుని ప్రకటించే విషయంలో ఎక్కువ టైం తీసుకున్న అల్లు అర్జున్ -ఇప్పుడు స్టార్ డైరెక్టర్లతో వరుస ప్రాజెక్టుల లిస్ట్ పెంచేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సెట్స్‌పైకి వెళ్లడానికి బన్నీ రెడీ కావడం తెలిసిందే. మరోసారి పూజా హెగ్దెతో ప్రాజెక్టు కోసం జోడీకట్టిన బన్నీ -ఏప్రిల్ చివరి వారంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పూరె్తైన వెంటనే -సుకుమార్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టు బన్నీ కోసం సిద్ధమైంది.
ఒకడుగు వెనక్కి వేయడమంటే -ఆగినట్టు కాదు, కొత్త ఉత్సాహంగా పరిగెత్తడానికేనన్న ఇన్‌స్పిరేషనల్ కోట్స్‌ని ఇప్పటి వరకూ బన్నీ అనేక సినిమాల్లో అనేక రకాలుగా చెప్పి, చూపించి ఉండొచ్చు. తాజాగా బన్నీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. గతేడాది రంగస్థలంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న సుక్కూ, బన్నీతోనూ అలాంటి బ్లాక్‌బస్టర్‌ను డిజైన్ చేస్తున్నాడు. 

అందులో భాగంగానే కథపై కసరత్తులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బన్నీకి జోడీగా సౌత్ సెనే్సషన్ రష్మిక,కనిపించనుంది.

ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వరుస సక్సెస్‌లతో ఊపుమీదున్న రష్మిక -బన్నీతో ప్రాజెక్టు తనను టాప్‌స్టార్ చేస్తుందన్న ఆనందంలో ఉంది, సుకుమార్ టీం రష్మికను సంప్రదించటం, ఆమె ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. సినిమా షూటింగ్‌ను ఆగస్టులోమొదలు,పెట్టనున్నారు.


అటు త్రివిక్రమ్, ఇటు సుకుమార్ తో రెండేసి భారీ హిట్లు అందుకున్న బన్నీ -ఈ రెండు ప్రాజెక్టులతో ఒకేసారి హ్యాట్రిక్ హిట్లు అందుకుంటాడన్న ఆనందంలో ఫ్యాన్స్ మునిగి తేలుతున్నారు, సోమవారం బన్నీ బర్త్‌డే సందర్భంగా ఆసక్తికరమైన టైటిల్‌తో మరో ప్రాజెక్టునూ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. 

ఏంసిఏ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న చిత్రానికి ఐకాన్‘ (కనబడుట లేదు ఉపశీర్షిక) టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. అంటే -కొద్ది రోజుల తేడాలోనే అధికారికంగా బన్నీ రెండు ప్రాజెక్టులు కన్ఫర్మ్ చేసినట్టు. సుక్కూనుంచి కూడా ప్రకటన వచ్చేస్తే -మూడు ప్రాజెక్టులు అవుతాయి. బన్నీ చూపిస్తోన్న ఊపే డబుల్ బొనాంజాగా మెగా ఫ్యాన్స్ హ్యాపీలో మునిగి తేలుతున్నారు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఉన్నది ఉన్నట్టు దింపారు

Tue Apr 9 , 2019
ఉన్నది ఉన్నట్టు దింపారు టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్‌ రెడ్డి. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను హిందీ రీమేక్ చేస్తున్నారు కబీర్‌ సింగ్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌ పాత్రలో […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: