కరోనా భయం… షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయిన హీరోయిన్!!

లోకనాయకుడు క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తెగా శ్రుతి హాస‌న్‌ వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. అయితే కేవ‌లం తన తండ్రి వార‌సత్వ బ‌లంతో ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేనని కెరీర్ తోలి నాల్లలోనే అర్థం చేసుకుని సింగర్ గా, ఐటమ్ సాంగ్స్ లో కూడా చేస్తూ చాలా తక్కువ టైం లోనే గొప్ప గుర్తింపు తెచ్చుకుంది.  అయితే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త బాగా ప్రచారం జరుగుతుంది అదేంటంటే తను షూట్టింగ్ చేస్తున్న ఒక తమిళ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఉన్న‌ట్టుండి ఆమె పేక‌ప్ చెప్పి వెళ్లిపోయారని సినిమా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆమె వెళ్ళిపోవడానికి అసలు కారణం కూడా  క‌రోనా భ‌య‌మే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఇక పూర్తీ వివరాల్లోకి వెళితే తమిళ మాస్ హీరో అయిన విజయ్‌ సేతుపతి హీరోగా వస్తున్న ‘లాభం’ అనే తమిళ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు దీనికి ఎస్పీ జననాథన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోన కారణంగా లేట్ అయిన ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌ పార్ట్ తమిళనాడులోని  ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. దాంతో కరోనా భయం ఉన్నా కూడా సినిమా షూటింగ్ అనగానే అది చూడ్డానికి జ‌నం ఎగబడ్డారు తమ అభిమాన హీరో హీరోయిన్ లు అయిన విజయ్‌, శ్రుతిహాసన్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. దాంతో గుంపు వల్ల కరోనా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందన్న అవగాహనా ఉన్న శ్రుతిహాసన్ షూటింగ్‌ మధ్యలోనే సెట్‌ నుంచి వెళ్లిపోయారు.

తమ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చిన జనాల్లో ఎవరికి కరోనా ఉందొ అన్న ప‌రిస్థితుల్లో తానూ అక్కడే ఉండి షూటింగ్‌ చేయడం అంత మంచిది కాద‌ని అక్క‌డి నుంచి శ్రుతి హసన్ వెళ్లిన‌ట్టు గా సినిమా సర్కిల్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ తర్వాత ఆమె ‘కొవిడ్‌-19 వల్ల ప్రతిఒక్కరీ ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. అది ఇంకా అంత‌రించిపోలేదు. ప్రోటోకాల్స్‌ ఫాలో కాని నేప‌థ్యంలో ఒక మహిళగా.. నటిగా జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉంది’ అని చేసిన ట్వీట్ తో ఈ విషయం నిజమే అని స్పష్టం చేసినట్లు అయ్యింది ఏమైనా సినిమా వాళ్ళు మనుషులే కరోనా భయం వాళ్ళకు కూడా ఉంటుంది.

Leave a Reply