కర్ణాటకలో కాంగ్రెస్ – జెడిఎస్ ప్రభుత్వం పడిపోతుందా??

కర్ణాటకలో కాంగ్రెస్ – జెడిఎస్ ప్రభుత్వం పడిపోతుందా??

కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బిజెపి అధికారాన్ని  చేజిక్కించుకోలేకపోయింది. చివరి నిమిషంలో జరిగిన అనూహ్య పరిణామాల వల్ల కాంగ్రెస్ జెడిఎస్ పార్టీలు కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని స్థాపించగలిగాయి. అది మొదలు బిజెపి కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి కూడా బిజెపి నాయకులు గైర్హాజరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. అయితే కాంగ్రెస్ జెడిఎస్ ఇరు పార్టీల మెజార్టీ కూడా బిజెపి కంటే ఎక్కువ కానప్పటికీ ఆ రెండు పార్టీలు బిజెపి ని నిలువరించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విజయం సాధించాయి. ఇకపోతే కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులు మొదటి నుంచి కూడా అటు ఇటు గా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ జిడిఎస్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కొంత మంది స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులే మద్దతు తీసుకున్నప్పటికీ ఇప్పుడు అదే స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల ఆ పార్టీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు జరిగిన తర్వాత కర్ణాటకలో ఉన్న అన్ని పార్టీలు తమ ఎమ్మెల్యే లను హైదరాబాద్ లో ఉన్న పలు రిసార్ట్ హోటల్స్ లకు పంపించి కాపాడుకోవడం జరిగింది.
గత కొన్ని నెలలుగా కర్ణాటకలో కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వం ప్రజలకు సేవలను అందిస్తూ వస్తుంది. అదే ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ బిజెపి తన ఏం ప్లాన్ తో ప్రభుత్వాన్ని పడిపోతుందని పుకార్లు కర్ణాటకలో షికార్లు చేస్తున్నాయి. సంక్రాంతి తర్వాత బిజెపి ఆపరేషన్ లోటస్ అనే పేరుతో కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని కర్ణాటకలో ఊహాగానాలు జోరుగా ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలో బిజెపిలో చేరబోతున్నారని అలాగే స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులు ముగ్గురు బిజెపికి తమ మద్దతు ఇస్తారని కర్ణాటక రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ అత్యధిక సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్పటికి అధికారం దక్కక పోవడంతో బిజెపి బిజెపి మాజీ అధినేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి  యడ్యూరప్ప తీవ్ర మనస్తాపం చెందారు. అప్పటినుంచి ఎడ్యూరప్ప ఎలాగైనా కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి మళ్లీ తాను ముఖ్యమంత్రి అవ్వాలని కంకణం కట్టుకున్నారు అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు బీజేపీ అధిష్టానం కర్ణాటకలో వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి తమ తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని చెబుతున్న కూడా లోలోపల కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిమిషం ఏం జరుగుతుందో ఎమ్మెల్యే ఏ పార్టీలోకి జంప్ అవుతాడు అన్న సస్పెన్స్ డ్రామా కర్ణాటకలో నడుస్తుంది. ఈ పార్టీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలు అందరిని గుర్గావ్ లో ఉన్న రిసార్ట్స్ లకు పంపించి కాపాడుకుంటుంది. అసలే ప్రభుత్వం ఏర్పడి ఏర్పాటు చేసిన రోజు నుంచి జెడిఎస్ తో తల నొప్పులు ఎదురుకుంటున్న ముఖ్యమంత్రి కుమారస్వామి కి ఇప్పుడు బిజెపి నుంచి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఒక ఒకవైపు మిత్రపక్షం జెడిఎస్ ను అన్ని విధాల అన్ని విధాలుగా సాటిస్ఫై చేస్తూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బిజెపి నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి కుమారస్వామిది. కర్ణాటక రాజకీయం అంటేనే జంప్ జిలానీలు కుట్రలు కుతంత్రాలు ప్రభుత్వాన్ని గద్దె దింపడాలు అని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కర్ణాటకలో రావడంతో అక్కడ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు

Tue Jan 15 , 2019
అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి తన సంక్రాంతి పండుగను పాలకొల్లులో జరుపుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో పాటు పాలకొల్లు లో ఉన్న అశేష మెగా ఫ్యామిలీ అభిమానులతో ఈ సంబరాలను జరుపుకున్నారు. పండుగ రోజు కావడం అల్లు అర్జున్ తమ ఊరికే రావడంతో ఆయనను చూడడానికి జనం ఎగబడ్డారు. https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: