కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న గల్లీ బాయ్

బాలీవుడ్ నయా సూపర్ స్టార్ రన్వీర్ సింగ్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది. స్ట్రీట్ ర్యాపర్ కథాంశం తో వచ్చిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే దాదాపు గా 40 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి ఈ వీకెండ్ వరకు 100 కోట్ల మార్క్ దాటుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం సింబా సినిమాతో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన రణ్వీర్ సింగ్ ఈ చిత్రం తో మరో పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పటి వరకు బాలీవుడ్ అంటే సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అంటూ ఖాన్ ల మీదే నడిచినా ఇప్పుడిప్పుడే రణ్వీర్ సింగ్ లాంటి క్రేజీ హీరోతో మెల్లగా అది మారుతున్నట్లు అనిపిస్తుంది. తనకు మాత్రమే ఒక క్రేజీ నెస్ తో తన బిహేవియర్ తో అటు ప్రేక్షకులను ఇటు సినీ జనాలను సమ్మోహన పరచడం కేవలం ఒక్క రణ్వీర్ సింగ్ కు మాత్రమే సాధ్యం అయ్యే పని అందుకేనేమో ఈ యువ హీరో వరుస విజయాలతో మిగతా హీరోలకు అందనంత ఎత్తుకు దూసుకు పోతున్నాడు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అర్జున్ రెడ్డి విజయ్ దేవర కొండ నిర్మాత పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ హీరో!!

Sat Feb 16 , 2019
పెళ్లిచూపులు సినిమాతో హీరో విజయ్ దేవరకొండకు బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి అనే సినిమా తో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అది వేరే విషయం అనుకోండి. అయితే తనను ఫస్ట్ హీరోని చేసిన తరుణ్ నే ఇప్పుడు లీడ్ రోల్ లో పెట్టి హీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా నిర్మిస్తున్నాడు. మీకు మరీ గమ్మత్తుగా అనిపించినప్పటికీ ఇది నిజం. […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: