కలెక్షన్స్ కొల్లగొడుతున్న కంగనా రనౌత్ మణికర్ణిక

0 0
Read Time:2 Minute, 40 Second

 కలెక్షన్స్   కొల్లగొడుతున్న కంగనా రనౌత్ మణికర్ణిక

ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా కంగనా రనౌత్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం మణికర్ణిక  శుక్రవారం రోజు రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తుంది. సినిమా విడుదలకు ముందు కొన్ని వివాదాల కారణంగా సినిమా రిలీజ్ అవుతుందో లేదో అన్న భయం ఉన్నప్పుడు కంగనారనౌత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో సినిమాకు వచ్చిన ప్రతి సమస్యను ఎదుర్కొంటారని ప్రకటించి సినిమా విడుదల అవడం లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. దానికి ఈ సినిమా ముందు తెలుగు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టినప్పటికీ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు క్రిష్ కు హీరోయిన్ కంగనా రనౌత్ కు మధ్య జరిగిన గొడవల వల్ల ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకి కంగనా రనౌత్ తానే దర్శకత్వం వహిస్తూ నటించారు. మా బడ్జెట్ కూడా 100 కోట్ల వరకు తీసుకెళ్లారని షూటింగ్ అప్పుడు కంగనా రనౌత్ చాలా మంది నీ చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టారని చాలా వార్తలు వినిపించాయి చివరకు ఇప్పుడు ఈ సినిమా విజయంతో ఆమె అందరి నోళ్లనీ ముయించినట్టు అయింది. అయితే ఒకపక్క ఈ చిత్ర దర్శకుడు క్రిష్ అలాగే ఈ చిత్రానికి కథను అందించిన బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ వీరిద్దరూ కంగనా రనౌత్ ఈ సినిమాను చెడగొట్టింది అని కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఒక సినిమా విజయమే దానికి ముఖ్యం కాబట్టి ఈ సినిమా విజయంతో జరిగిన వివాదాలు అన్ని సమసిపోయాయి అని చెప్పాలి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: