కళ్యాణ్ రామ్ సినిమాకి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ లు!!


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ కెమెరా మెన్ గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది దాని పేరు 118 ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యే పూర్తి చేసుకుంది. నివేద థామస్ షాలిని పాండే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ వేసవి కానుకగా విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రోజు ఫిల్మ్ నగర్ లోని జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుంది. దీనికి చీఫ్ గెస్ట్ లుగా యువరత్న నందమూరి బాలకృష్ణ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరిద్దరూ వస్తున్నారు. నందమూరి హీరోలు అందరూ కలిసి కట్టుగా వున్నారనే మెసేజ్ ను మరోసారి తమ అభిమానులలో కలగ జేయడానికి రాబోతున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా తర్వాత నాని తో మజ్ను సినిమా తీసిన డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్య కళ్యాణ్ రామ్ వరస ఫ్లాప్ లతో సతమత మవుతున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం ఆయనకు చాలా ముఖ్యమైనది ఎట్టి పరిస్థితుల్లో 118 తో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాలి.ఇప్పటికే యువ హీరోలు అందరూ వరుస విజయాలతో దూసుకుపోతున్న సందర్భంలో కళ్యాణ్ రామ్ వెనుక పడి పోయాడని చెప్పొచ్చు. మంచి కథ కథనాలు దొరికితే కళ్యాణ్ రామ్ కు పెద్ద కమర్షియల్ హిట్ రావడం పెద్ద కష్టమేమీ కాదు ఇంతకు ముందు అతనొక్కడే లాంటి సినిమాతో ఆ విషయం ప్రూవ్ అయ్యింది కూడా కళ్యాణ్ రామ్ కు అన్ని విధాల ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ ఉంది ఆయన సినిమా బాగుంది అంటే ఖచ్చితంగా అందరూ చూస్తారు. కళ్యాణ్ రామ్ 118 తో ఈసారైనా హిట్ కొడతాడా లేదా అనేది వేచి చూడాలి.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Nani Gang Leader Movie teaser

Sun Feb 24 , 2019
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: