కాంచన 3 గా వస్తున్న లారెన్స్

కాంచన 3 గా  వస్తున్న లారెన్స్

ప్రముఖ ఫోటోగ్రాఫర్ నటుడు దర్శకుడు లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన 2 అనే సినిమా ఇంతకుముందు తెలుగులో కి డబ్బింగ్ అయి చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో హారర్ కి కామెడీ తోడవడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు అదే లారెన్స్ దానికి కొనసాగింపుగా కాంచన 3 అనే సినిమా తమిళ్ లో తీస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాని కూడా తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈరోజు లారెన్స్ విభిన్నమైన గెటప్ తో ఉన్న ఒక పోస్టర్ ని కాంచన 3 అనే పేరుతో విడుదల చేశారు. గతంలో కాంచన కాంచన 2 అనే సినిమాను తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేసి చాలా లాభాలు గడించారు. ఆ మధ్య తెలుగు లో కూడా హారర్ కామెడీ సినిమాలు విపరీతంగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అయితే ఈ మధ్య మళ్లీ ఆ సినిమాల జోరు తగ్గింది. ఆ మధ్య ఎప్పుడో నిఖిల్ హీరోగా వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా కూడా బాగానే ఆడింది. కాకపోతే చిన్న సినిమాల్లో కూడా అడపాదడపా ఇలాంటి హారర్ కామెడీ సినిమాలు వస్తూనే ఉంటా. అయితే లారెన్స్ ముని కాంచన చిత్రాలు తెచ్చి పెట్టిన పేరు అంత ఇంత కాదు ఆ తర్వాత లారెన్స్ వీర చిత్రాలు చేసినా అవి అనుకున్నంతగా ఆడలేదు. మళ్లీ తనకు అచ్చొచ్చిన హారర్ కామెడీ జోనర్ లో వస్తున్న లారెన్స్ ఈసారైనా హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి మరి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రివ్యూ - ఎన్టీఆర్ కథానాయకుడు బాలకృష్ణ మెప్పించాడు!!

Wed Jan 9 , 2019
రివ్యూ: ఎన్టీఆర్ కథానాయకుడు – బాలకృష్ణ మెప్పించాడు!! రేటింగ్: 3.5/5 రివ్యూ- ఎన్టీఆర్ కథానాయకుడు బాలకృష్ణ మెప్పించాడు!!ఎన్టీఆర్ బయోపిక్,  నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావు గారి బయోపిక్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. గొప్ప నటుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ఆ మహావ్యక్తి జీవితచరిత్రను సినిమాగా తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: