1 C
New York
January 27, 2021
CINEMA RASCALS
Entertainment News Latest Movies reviews Trending Now

కాజల్ ఫస్ట్ డేటింగ్ కబుర్లు!!!

కాజల్ ఫస్ట్ డేటింగ్ కబుర్లు!!!

కాజల్ అగర్వాల్ ఇటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అటూ తమిళ్, హిందీ లలో కూడా దాదాపు 14 ఏళ్లుగా నంబర్ వన్ హీరోయిన్ గా ప్రేక్షకులకు ఎప్పటికీ బోర్ కొట్టని అందాల సుందరిగా సినిమా  ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగు, తమిళం, హిందీ లలో కలిపి ఎన్నో సినిమాల్లో నటించి అవార్డ్స్ కూడా గెలుచుకుంది. అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలు చేసింది. ఆమె నటించిన అన్ని సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు అదుర్స్ అనేలా ఉంటాయి.

అయితే నటించి, నటించి మరి బోర్ కొట్టిందో లేక తనకూ ఒక తోడు కావలనుకుందో కానీ కాజల్ రీసెంట్ గానే పెళ్లి చేసుకుని తన ఫాన్స్ కు షాక్ ఇచ్చింది. అయితే ఆమెది ప్రేమ వివాహం కావడం ఇక్కడ విశేషం… తన లవ్ స్టొరీ అనుభవాల గురించి కాజల్ చెపుతూ తన నిజజీవిత ప్రేమ కథలో మాత్రం అదుర్స్ అనిపించే లవ్ సీన్స్ లేవంటోంది. తన భర్త గౌతమ్ తో తన ప్రేమ ప్రయాణం చాల నార్మల్ గా, కూల్ గా అలా జరిగిపోయిందని తను ఏడేళ్లుగా గౌతమ్ తో ప్రేమలో ఉన్నప్పటికీ తమ లవ్ స్టొరీ లో పెద్ద అదిరిపోయే విశేషాలు ఏవీ లేవని అంటుంది.కాజల్ ఇంకా లవ్ స్టొరీ గురించి చెపుతూ”ఇన్నేళ్ల మా పరిచయంలో గౌతమ్ తో నాకు పెద్ద అడ్వెంచర్స్ అనుభవాలు ఏవీ లేవు. ఎందుకంటే మేము ప్రేమికులుగా మారడం కంటే ముందు మంచి స్నేహితులం. మా ఇద్దరి విషయంలో చాలా విషయాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోయాయి.

ఫస్ట్ నుంచి మేము ఒకర్ని ఒకరం సపోర్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఒకర్ని మరొకరం బాగా అర్థం చేసుకున్నాం. ఇక మా పెళ్లికి దారితీసిన సంఘటనలు కూడా ఫాస్ట్ గా నార్మల్ గా జరిగాయి. అయితే తన భర్త గౌతం తో తమ లవ్ స్టొరీ మరీ ఆహా అనిపించకపోయినప్పటికీ.. అతనితో ఫస్ట్ డేట్ మాత్రం తనకు చాలా స్పెషల్ అంటోంది కాజల్. గౌతమ్ కాజల్ ను తొలిసారి ముంబయిలోని ఎన్సీపీఏ కేఫ్ కు డేటింగ్ కు తీసుకెళ్లాడట అక్కడ ఆమెతో రొమాటిక్ విషయాలేవీ మాట్లాడకుండా కాజల్ ను అన్ని క్వశ్చన్స్ అడిగేసరికి తనకది ఓ పెద్ద ఇంటర్వ్యూలా అనిపించిందట.

Related posts

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిసిన త్రివిక్రమ్

cinemarascals

RRR #RRRMovie #RoudramRanamRudhiram RRR Motion Poster – Telugu | NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris | SS Rajamouli

cinemarascals

Durgamati movie review: Unintentionally hilarious

cinemarascals

Leave a Comment