కుక్క బిస్కెట్స్ తింటున్న స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ షాక్…???
ఈ విషయాన్ని స్వయంగా ఈమె నోటితోనే చెప్పుకొచ్చింది. అయితే ఈ సీక్రేట్ బయటపెట్టింది మాత్రం హీరో నితిన్. (RASHMIKA MANDANA & NITHIIN)
అంత వింత అలవాటు ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. రష్మిక మందన్న.
పైగా హీరో నితిన్ ఇదే విషయాన్ని చెప్పాడు కూడా. అయితే చెప్పనీయకుండా రష్మిక ఆయన నోరు నొక్కే ప్రయత్నం చేసింది. ఇక కుక్క బిస్కెట్ల విషయానికి వస్తే ఎందుకు తినాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తను ప్రతి విషయాన్ని ఆసక్తిగా గమనిస్తానని.. అలా తన దగ్గర ఓ కుక్క పిల్ల ఉందని చెప్పింది రష్మిక. అది చాలా క్యూట్‌గా ఉంటుంది.. ఇది క్యూట్‌గా ఉంటుంది కదా.. మరి అది తినే బిస్కెట్ ఇంకెంత టేస్ట్‌గా ఉంటుందో చూద్దామని ట్రై చేసినట్లు చెప్పుకొచ్చింది రష్మిక. అయితే అది అంత అసహ్యంగా ఏమీ లేదని ఈమె చెప్పడం విడ్డూరం. ఏదేమైనా కూడా రష్మిక కుక్క బిస్కెట్ల మ్యాటర్ మాత్రం చాలా ట్రెండ్ అవుతుంది.

అదేంటి.. ఎవరైనా కుక్క బిస్కెట్స్ తింటారా..? తింటే గింటే నార్మల్ బిస్కెట్స్ తినాలి కానీ కుక్క బిస్కెట్స్ తినడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. అంత వింత అలవాటు ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. రష్మిక మందన్న. ఈ విషయాన్ని స్వయంగా ఈమె నోటితోనే చెప్పుకొచ్చింది. అయితే ఈ సీక్రేట్ బయటపెట్టింది మాత్రం హీరో నితిన్.

ఈ ఇద్దరూ కలిసి భీష్మ సినిమా లో నటించారు. ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్, రష్మిక వాలెంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగానే ‘మీ గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పండి’ అని యాంకర్ ప్రశ్నించగా.. ఈ కుక్క బిస్కెట్ల విషయం బయటికొచ్చింది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss