కెసిఆర్ శత్రువు కాళ్ల బేరానికి వచ్చాడు

కెసిఆర్ శత్రువు కాళ్ల బేరానికి వచ్చాడు

కాళ్ల బేరానికి వచ్చిన కెసిఆర్ శత్రువు ఎవరని ఆలోచిస్తున్నారా అదేనండి మన ఒంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ లో కెసిఆర్ మీద పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంతకు ముందు 2014 ఎలక్షన్స్ లో కూడా ఆయన కేసీఆర్ మీద గజ్వేల్ లో పోటీ చేసి పరాజయం పొందారు. మళ్లీ మొన్న జరిగిన 2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  ప్రతాపరెడ్డి  కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కానీ ఘోరంగా పరాజయం పాలయ్యారు.  మొదటి నుంచి తెలంగాణ లో ఎక్కడ నుంచి ఏ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసినా కూడా కేసీఆర్ కు ఎదురులేకుండా పోయింది. తను పోటీచేసిన ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల నుంచి బంపర్ మెజారిటీతో కేసీఆర్ గెలుపొం దుతూ వచ్చారు. అయితే కేవలం ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం ఒంటెరు ప్రతాపరెడ్డి కేసీఆర్ కు ప్రతిసారి గట్టి పోటీని ఇస్తూ వచ్చారు ఈ సారి జరిగిన ఎలక్షన్స్ లో కూడా వంటేరు ప్రతాపరెడ్డి కచ్చితంగా కేసీఆర్ ను ఓడించి ఆయన రాజకీయ సన్యాసం చేసేలా చేస్తానని చాలా వాగ్దానాలు ప్రగల్బాలు ఎన్నికల ముందు జరిగిన ప్రచారంలో పలికారు. ఆ మధ్య లగడపాటి రాజగోపాల్ తన సర్వే విషయాలు చెప్పినప్పుడు కూడా గజ్వేల్ లో కెసిఆర్ ఓడిపోతున్నారు అన్నట్టుగా కామెంట్ చేయడం కూడా జరిగింది. అయితే తన కను సైగలతో తెలంగాణ రాష్ట్రాన్ని  శాసించే సత్తా ఉన్న కేసీఆర్ ను ఓడించడం అంత ఈజీ కాదు దానికోసం వంటేరు ప్రతాపరెడ్డి గడచిన రెండు ఎలక్షన్స్ లో తన ఆస్తులు అన్ని అమ్ముకుని ఎంతో ప్రయత్నించినా కూడా కేసీఆర్ ను ఓడించ లేకపోయారు. అయితే ఇప్పుడు ప్రతాప్ రెడ్డికి సీను బాగా అర్థం అయినట్లు ఉంది వరుసగా రెండవసారి కూడా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఇక తన మనుగడకే ముప్పు వాటిల్లుతుందని అర్థం చేసుకున్న ప్రతాపరెడ్డి చల్లగా టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలలో ఎంత శత్రువుల మీద పోటీ చేసినా ఆస్తులు అమ్ముకున్నా ఒక టైమ్ వచ్చేసరికి రాజకీయంగా నిలబడాలి అంటే భవిష్యత్తు కోసం ఆలోచించాలి అప్పుడు కచ్చితంగా కొన్నిసార్లు రాజీ పడక తప్పదు ఆ విషయం ఇప్పుడు ప్రతాపరెడ్డికి బాగా అర్థం అయ్యే టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కేసీఆర్ లాంటి మహా నాయకుడుతో ఎంత పోరాడినా ఫలితం ఏది ఉండదు అమోఘమైన ప్రజాభిమానం నాయకత్వ లక్షణాలు ఉన్న కేసీఆర్ ను ఓడించడం అంటే అది ఎన్ని తరాలకు ఐనా జరగని పని అందుకే వంటేరు ప్రతాపరెడ్డి ఇక తన ప్రయత్నాలన్నీ మానుకొని టిఆర్ఎస్ పార్టీలో చేరి తద్వారా తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని అనుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిసారి వంటేరు ప్రతాప రెడ్డి కి టికెట్ తెచ్చిన ఆయన కెసిఆర్ మీద ఒక సారి కూడా గెలవలేక పోయారు. తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ బలం ఇప్పటికే 90 మంది ఎమ్మెల్యేలు గా ఉంది అలాంటి తరుణంలో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలను అలాగే టిడిపిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలోకి ఆకర్షించాలని ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కెసిఆర్ ప్రతిసారి తమ పార్టీ వంద అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని చెప్పుకుంటూ వచ్చారు కానీ టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో కేవలం 88 సీట్లు మాత్రమే వచ్చాయి ఇప్పుడు ఎలాగైనా 100 అనే సంఖ్య ను పూర్తిచేయాలని కేసీఆర్ కంకణం కట్టుకొని ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఎన్నికలప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను వాడి ఎన్నికల తర్వాత అసెంబ్లీ లో ఆయా పార్టీల సంఖ్యాబలం తగ్గించడం ద్వారా తన ప్రత్యర్థి పార్టీల మీద కెసిఆర్ ఎప్పుడూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అదే స్ట్రాటజీ ని కెసిఆర్ అమలు చేయబోతున్నారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి లో ఉన్న ఎమ్మెల్యేలకు వల వేస్తూ ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి టిడిపిని తెలంగాణలో నిర్వీర్యం చేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీని కూడా చేద్దామని తద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక లా చేద్దామని కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందరూ అసలు కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించిన కెసిఆర్ ఇప్పుడు తను పెట్టుకున్న లక్ష్యాన్ని కూడా అలవోకగా సాధిస్తారని అనుకోవచ్చు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

కమల్ హాసన్ శంకర్ ఇండియన్ 2 స్టిల్స్

Fri Jan 18 , 2019
కమల్ హాసన్ శంకర్ ఇండియన్ 2 స్టిల్స్     https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: