కె. జి. ఎఫ్ మరో బాహుబలి అవుతుందా??

 

కె. జి. ఎఫ్ మరో బాహుబలి అవుతుందా??

కన్నడ లో బాహుబలి రేంజ్ హడావుడి జరుగుతోంది  కేజీఎఫ్  అనే  సినిమాకు. భారీ వ్యయంతో నిర్మించిన కేజీఎఫ్ కు తెలుగునాట మాత్రం గట్టిపోటీ తగిలింది. అదీ మంచి క్రేజ్ ఉన్న హీరో లు నటించిన సినిమాలు అవి పడి పడి లేచే మనసు, అంతరిక్షం. మరొక పక్క తెలుగులో బాగా క్రేజ్ వున్న సాయి పల్లవి నటించిన తమిళ డబ్బింగ్ సినిమా మారి 2. సోలో రిలీజ్ కు ఛాన్స్ లేకుండా ఈ మూడు సినిమాల మధ్య ఇరుక్కుంది కేజీఎఫ్.

ఇప్పటికే ఈ సినిమాలు అన్నీ థియేటర్లు ఆక్యుపై చేసేసాయి.యూత్ లో మంచి క్రేజ్ ఉన్న శర్వానంద్ సినిమా పడి పడి లేచె మనసు కోసం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ థియేటర్లు బాగా సెట్ చేసుకున్నారు. వినయ విధేయ రామ సినిమాకు అగ్రిమెంట్ లు చేసుకున్న థియేటర్లు అన్నీ పడి పడి లేచె మనసు సినిమాకు కేటాయిస్తున్నారు.

నైజాంలో ఆసియన్ సునీల్ నే ఈ సినిమా చేస్తున్నారు. ఆయనే కేజీఎప్ ను కూడా పంపిణీ చేస్తున్నారు. దీంతో సహజంగానే ప్రయారిటీ పడి పడిలేచె మనసుకు లభిస్తోంది. అటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న  అంతరిక్షం సినిమా దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు నైజాంలో. సో, అటు దిల్ రాజు, ఇటు సునీల్ రెండు స్ట్రయిట్ సినిమాలు ఫిల్ చేయగా మిగిలినవి కేజీఎఫ్ కు దొరుకుతున్నాయి. మిగిలిన ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి వుంది. ఇక పోతే తమిళ్ లో మాంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ధనుష్ మారీ 2 సినిమాను ఏరియాల వారీ అమ్మేసారు. అందువల్ల లోకల్ బయ్యర్లు థియేటర్లను చూసుకుంటున్నారు.

కానీ బాహుబలి రేంజ్ బిల్డప్ ఇస్తున్న ఈ కేజీఎఫ్ డైరక్ట్ రిలీజ్. దాంతో థియేటర్ల కోసం కిందా మీదా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే వరుణ్ తేజ్, శర్వానంద్, ధనుష్ లు నోటెడ్ ఫేస్ లు కనుక ఓపెనింగ్స్ మీద ఆసక్తి కనిపిస్తోంది. యాష్ మన వాళ్లకు పరిచయం లేదు. అందువల్ల బజ్ రావడంలేదు.

కానీ ఒకటే ఆశ. సినిమా బాగుంది అన్న మౌత్ టాక్ వస్తే మన ప్రేక్షకులు సినిమాను నెత్తిన పెట్టేసుకుంటారు. కేజీఎప్ కు ఆ మౌత్ టాక్ రావాలి. అది వస్తే ఓ రేంజ్ లో వుంటుంది. రాలేదూ అంటే మాత్రం సమస్యే.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ధనుష్ సినిమాకు దిమ్మ తిరిగే రేట్!!!!

Tue Dec 18 , 2018
ధనుష్ సినిమాకు దిమ్మ తిరిగే రేట్!!!! రజనీ కాంత్ అల్లుడు తమిళ్  హీరో ధనుష్  కోలీవుడ్ లో ఇతడు పెద్ద హీరోనే. రజనీకాంత్ అల్లుడిగా, స్టార్ హీరోగా అతడికి తిరుగు లేని ఇమేజ్ ఉంది. కానీ అదే ఇమేజ్ టాలీవుడ్ లో కూడా ఉందని భ్రమించడంతోనే ఇబ్బంది వస్తోంది. తెలుగులో కూడా తనకు తిరుగులేదు అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు ధనుష్. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ధనుష్ లేటెస్ట్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: