Read Time:2 Minute, 31 Second
కైరా అడ్వాణీకి ఏం అయింది …ఆ బుగ్గల పై
కైరా అడ్వాణీ రూమర్లు
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కియారా అద్వానీ ముఖంపై రెండు మచ్చలు కనిపించడం, ముఖం వాచిపోయి ఉండటంతో రకరకాల ఊహాగానాలకు చోటిచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ వికటించిందని కొందరు రూమర్లను వార్తలుగా మలిచారు. తనపై వస్తున్న రూమర్లకు ఆమె సమాధానం ఇచ్చింది.
ఎంఎస్ ధోని బయోపిక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కియారా అద్వానీ అటు గ్లామర్ పరంగాను, నటనపరంగాను అందర్ని ఆకట్టుకొంది. ఆ తర్వాత టాలీవుడ్లో ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు పక్కన భరత్ అనే నేను సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. అంతేకాకుండా రాంచరణ్‌తో వినయ విధేయ రామలో కూడా ఆఫర్‌ను దక్కించుకొన్నది. తాజాగా బాలీవుడ్లో రెండు భారీ సినిమా ఆఫర్లను చేజిక్కించుకొన్నది. ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్లున్న కియారాపై రూమర్లు రాగా.. ఆమె క్లారిటీ ఇచ్చింది. అవేమిటంటే..
ప్లాస్టిక్ సర్జరీ వికటించిందా?
ముంబై మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. ఓ వస్త్ర సముదాయం ప్రారంభోత్సవానికి వెళ్లడానికి సమయం లేకపోవడంతో నేను మేకప్ చేసుకొన్నాను. దాంతో కాస్త తేడాగా కనిపించింది. నా బుగ్గలపై గాట్లు పడినట్టు కనిపించాయి అని కియారా వెల్లడించింది.
నాకే అనుమానం వచ్చిందని , నా ముఖంలోని ఎముక ఉబ్బెత్తుగా ఉండటం వల్ల చూసే వారికి అనుమానం కలిగించేలా చేసింది. ఆ రకంగా నా ముఖంపై మచ్చల గురించి రకరకాలుగా మాట్లాడుకొన్నారు. నా ముఖంపై ఉన్న మచ్చలను చూసి నాకే అనుమానం వచ్చేలా కామెంట్ చేశారు అని కియారా అన్నారు
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss