కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండిలా!!!

0 0
Read Time:9 Minute, 5 Second

కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండిలా!!!

              Image credited from google.com

మరొక ఏడాది గడిచిపోయింది. అంటే మీ జీవితంలో మీరు గడిపేసిన జీవితం మళ్ళీ తిరిగి రాదు అందుకే దాన్ని గతం అన్నారు. ఈ ప్రపంచంలో ఏ జీవ రాశుల్లో గతంలో బతికేవి ఏవీ ఉండవు ఒక్క మనిషి తప్పా…

అందుకే ప్రపంచంలో ఉన్న ఏ మహామహులైన గతంలో బతకడం కాదు భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్పారు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో గతంలో జరిగినవనన్నీ మరిచిపోయి ఉరకలేసే ఉత్సాహంతో మీ భవిష్యత్తు మీద కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి.

                Image credited from google.com

మీకంటూ జీవితంలో ఒక గోల్ ఉంది కానీ అది ఈ సంవత్సరంలో మీరు సాధించలేకపోయారు దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు వచ్చే కొత్త సంవత్సరం లో మళ్లీ మీకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఇంకా బతికే ఉన్నారు.

ఈ సంవత్సరం మీరు ఎన్నో అవమానాలు ఎదురుకున్నారు కష్టాలు పడ్డారు జీవిత సమరంలో అవన్నీ మామూలే ఎవరికి తెలుసు వచ్చే సంవత్సరంలో మిమ్మల్నందరూ పోగుడుతారేమో మీ జీవితంలో మీరు అనుకున్నవన్ని సాధిస్తారేమో!!!

ప్రతి నిమిషం ప్రతి గంటా ప్రతి రోజూ ప్రతి నెలా ప్రతి సంవత్సరం ఇవన్నీ ముఖ్యమైనవి.కనురెప్పపాటు కాలంలో కూడా మీ జీవితంలో అద్భుతాలు జరుగొచ్చు
అందుకే ఏ రోజు ఏ నిమిషం ఒక్క క్షణం కూడా నమ్మకాన్ని కోల్పోకండి.

           Image credited from google.com

తప్పులు అందరూ చేస్తారు మీ జీవితంలో మీరు తప్పులు చేశారని మిమ్మల్ని మీరు అంతగా నిందించు కోకండి మీకో విషయం తెలుసా మీరు తప్పు చేశారు అంటే ఖచ్చితంగా జీవితంలో ఎదుగుతున్నారు అని అర్థం. ఒకసారి పడితేనే కదా మళ్ళీ లేస్తారు.

ఈ భూమ్మీద మనిషిగా పుట్టినందుకు కచ్చితంగా మీ జీవితంలో మీరు ఏదో ఒకటి సాధించే మరణిస్తారు అందరి విషయాల్లో అది జరుగుతుంది కానీ అలా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కొందరు మాత్రమే తెలుసుకుంటారు.

జీవితంలో ఏదైనా సాధించాలని మీలో ఒక కోరిక పుట్టింది అంటే కచ్చితంగా జరుగుతుంది అని అర్థం ఎందుకంటే మీ వల్ల కానిదేది మీ జీవితంలోకి రాదు.

మిమ్మల్ని మీరు నమ్మండి మీరు ఏదైతే సాధించాలనుకుoటున్నారో దాన్ని మీరు కచ్చితంగా సాధించగలరని విశ్వసించండి.

          Image credited from Google.com
             

ప్లానింగ్… మీరెప్పుడైనా గమనించారో లేదో మీరు బ్రష్ చేసుకునే దానికి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది.
ముందుగా పేస్ట్ పెట్టుకొని ఆ తర్వాత పళ్లు తోముకొని ఆ తర్వాత ముఖం కడుక్కుంటారు మన జీవితంలో రోజూ చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల్లో నే ఇంత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉందంటే మీరు మీ జీవితంలో సాధించాలనుకుంటున్న పెద్ద పెద్ద గోల్స్ విషయంలో మీరు ఇంకా ఎంత పద్ధతిగా ఉండాలి ఎంతగా ప్లానింగ్ చేసుకోవాలి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

మీ గోల్స్ అన్నింటిని ఒక బుక్ లో రాయండి. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తులైనా ఎలాంటి గొప్ప పుస్తకాలు రాసిన వాళ్ళయినా మీకు చెప్పేది ఒకటే మీ గోల్స్ ని పేపర్ మీద రాయండి అని ఎందుకంటే రాయడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. మీకు ఫలానాది కావాలని మీరు ఈ విశ్వానికి చెబుతున్నారు అందుకు తగిన విధంగా మీ శ్రమ అందులో మీరు పెడుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ విశ్వం మీరు కోరుకున్నది ఇస్తుంది.

మంచి మంచి బుక్స్ చదవండి. మీకు అంత టైం లేక పోతే ఎలాగూ యూట్యూబ్ ఉండనే ఉంది దాంట్లో ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూడండి ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు వాళ్ల జీవితాల్లో ఎలా విజయాలు సాధించారో తెలుసుకోండి. మీరు మామూలుగానే టైంపాస్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో ఏవేవో వీడియోలు చూసి ఉంటారు అలాంటిది మీ జీవిత గమ్యం కోసం కొంత టైం కేటాయించి గొప్ప వీడియోలు చూడడం పెద్ద కష్టమేమీ కాదు.

Image credited from Google.com

పాజిటివ్ థింకింగ్. ఎల్లప్పుడూ పాజిటివ్ గానే ఆలోచించండి ఒక్క నిమిషం కూడా మీ మైండ్ లోకి నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి.మీరు మీ రోజువారి జీవితంలో ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారో కచ్చితంగా మీరు దానిని మీ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తారు. అందుకే ప్రతి నిమిషం మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ జీవితంలో ఏ మార్పులు జరగాలని కోరుకుంటున్నారు మీరేం కావాలనుకుంటున్నారు అనే దాని మీద ధ్యాస వుంచండి.

మీరు ఏదైతే జీవితంలో సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో అది అంత అసాధ్యమైనదేమి కాదు దాన్ని ఇంతకు ముందే కొన్ని కోట్ల మంది సాధించారు మీరే మొదటి వ్యక్తి కాదు ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా ఒకరు సాధించారంటే కచ్చితంగా మిగతా వాళ్ళు కూడా సాధించగలరు అని అర్థం.

ఇంతవరకు మీ జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అన్ని సంవత్సరాలు మీరేం చేశారు మీ జీవితంలో ఏం జరిగాయి అనేది ఒక్కసారి మళ్ళీ రివిండ్ చేసుకోండి.ఇక ముందు మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి ఎలా ఉండాలి అనే దాని మీద కసరత్తు చేయండి. మనిషి అన్న తర్వాత కచ్చితంగా మార్పు రావాల్సిందే.

          Image credited from Google.com

ఇయర్లీ గోల్స్, క్వార్టర్లీ గోల్స్, మంత్లీ గోల్స్, వీక్లీ గోల్స్, డైలీ గోల్స్ అని ఇలా మీరు పెట్టుకున్న పెద్ద పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న వాటిగా డివైడ్ చేసుకోండి. ఒకేసారి మీరు వంద మెట్లు ఎక్కలేరు కానీ ఒక్క మెట్టు తో మొదలు పెడితే వందో మెట్టుకు ఖచ్చితంగా చేరుకుంటారు.

మీ జీవితంలో ఉన్న వాటికి మీరు కృతజ్ఞతగా ఉండండి. మీరు వేసుకునే బట్టలు మీరు వాడే బైక్  మీరు తినే తిండి మీ దగ్గర ఉన్న ఫోన్ మీరు ఉండడానికి ఉన్న ఇల్లు మీ తల్లిదండ్రులు మీ బంధువులు మీ స్నేహితులు మీ కొలీగ్స్ ఇలా మీ జీవితంలో ఉన్న అన్నిటికీ మీరు కృతజ్ఞులై ఉండండి. నా జీవితం బాగుంది నేను కోరుకున్నవన్నీ నాకు దక్కుతున్నాయి నా జీవిత లక్ష్యాన్ని కూడా కచ్చితంగా నేను సాధించగలను అన్న నీ విశ్వాసమే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది.

మరింకేం రెట్టించిన ఉత్సాహంతో  ఈ కొత్త సంవత్సరానికి  మీ జీవితానికి స్వాగతం పలకండి.

WISH YOU HAPPY NEW YEAR 2019

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: