కోహ్లీ సేన చరిత్ర సృష్టించారు

కోహ్లీ సేన చరిత్ర సృష్టించారు

         
              Image credited from Twitter.com
ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను 70 ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారి గెలుచుకోవడం ద్వారా టీమిండియా చరిత్రను తిరగరాసింది. కెప్టెన్ కోహ్లి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీం ఇండియా అసలు ఇలా సీరీస్ గెలుస్తుందని ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. మన వాళ్లు ఎంత పోరాడినా అవతల ఉన్నది ఆస్ట్రేలియా కాబట్టి కచ్చితంగా సిరీస్ మనకు రాకుండా అడ్డుకుంటారనే అందరూ అనుకున్నారు. అయితే తమ అద్భుతమైన పోరాటపటిమతో బౌలర్లు బ్యాట్స్ మాన్ కలిసి కట్టుగా రాణించడంతో టీమిండియాకు ఈ ఫీట్ సాధ్యమైంది.


కోహ్లీ అనుకుంటే పూజారా నిలిచాడు

             
ఆస్ట్రేలియా సిరీస్ కు టీమిండియా వెళ్లే ముందు నుంచి అందరికీ అంచనాలు ఉన్నది అద్భుతంగా రాణిస్తాడు అని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీదనే అయితే ఆశ్చర్యంగా సిరీస్ ముగిసే సరికి పూజారా తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఈ సిరీస్ మొత్తానికి హీరో అయ్యాడు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను తలపిస్తూ అతను ఆడిన ఇన్నింగ్స్ లు ఒక క్లాసిక్ లాగా చెబుతున్నారు. ఒకవైపు తన సహచరులందరూ విఫలమవుతున్న కూడా మరో వైపు ఒక గోడలాగా నిలబడి బ్యాటింగ్ చేస్తూ ప్రతిసారి కష్టాల్లో ఉన్న టీమ్ ను ఆదుకున్నాడు. ముఖ్యంగా చివరి టెస్టులో అతను చేసిన 195 పరుగులు ఈ సిరీస్ మొత్తానికి హైలెట్ గా పేర్కొనవచ్చు. కేవలం ఐదు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని  కోల్పోయినప్పటికీ ఇండియా 622 భారీ పరుగులు చేసిందంటే అది పూజారి బ్యాటింగ్ మహిమే. టీమిండియా ఓపెనర్లు ప్రతిసారి విఫలమవుతూ వచ్చినప్పటికీ పుజారా మాత్రం టీం తన మీద ఆశలు పెట్టుకున్న ప్రతిసారి రాణించాడు. ఆస్ట్రేలియన్ బౌలర్స్ సైతం పూజారిని అవుట్ చేయడం మాకు కష్టంగా మారిందని  కామెంట్ చేశారు అంటే అతను బ్యాటింగ్ ఎంత గొప్పగా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే యువకెరటం రిషబ్ పంత్ కొన్ని టెస్టుల్లో రాణించిన బాగా కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అయితే చివరి టెస్టులో పంత్ సాధించిన 150 పరుగులు కూడా అద్భుతమైన ప్రదర్శన అనే చెప్పాలి.

గతం – ప్రస్తుతం:

            
ఆస్ట్రేలియాతో సిరీసా అమ్మో మనవాళ్లు టెస్టుల్లో వన్డేల్లో టీ 20 ల్లో అయినా అసలు ఒక్క సిరిసైనా గెలుస్తారా ఇది ఒకప్పటి మాట… కానీ ఇప్పుడు టీమ్ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ పర్యటనకు వెళ్తుంటే ప్రతి సగటు అభిమాని మన వాళ్లు కచ్చితంగా అన్ని సీరీస్ లు  గెలవడానికి ప్రయత్నిస్తారని ఆశలు పెట్టుకున్నాడు అంటే దానికి కారణం కోహ్లీ సేన ప్రస్తుతం టీమిండియా ఎంత బలంగా ఉందంటే ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తమ అద్భుతమైన పోరాటపటిమ తో వాళ్ళని ఓడిస్తున్నారు. ప్రపంచ క్రికెట్ ఐసిసి ర్యాంకింగ్స్ లో టెస్టుల్లో కానీ వన్డేల్లో కానీ టీ20లో కానీ మన వాళ్లు టాప్ 3 లో ఉంటున్నారు అంటే టీమిండియా ఎంత పటిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోగలం. 

స్లెడ్జింగ్ – ఆస్ట్రేలియా

  
ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఆస్ట్రేలియా అంటే స్లెడ్జింగ్  స్లెడ్జింగ్ అంటే ఆస్ట్రేలియా అన్నట్టు గా ఉంటూ వస్తుంది. అయితే ఈసారి మన వాళ్లు కూడా ఆస్ట్రేలియన్స్ మీద రెచ్చిపోయారు. యంగ్ మ్యాన్ రిషబ్ పంత్ లాంటి వాళ్లు కూడా ఆస్ట్రేలియా క్రికెటర్ ల మీద కామెంట్లు చేస్తూ వాళ్ళ మీద తమ ఆధిపత్యం చెలాయించారు. నిజానికి కెప్టెన్ కోహ్లి లో ఉన్న కసి గెలవాలి అని ఉన్న పట్టుదల ప్రతిసారి ఆటలో తను ముందుండి జట్టును నడిపించడం ఇవన్నీ కూడా టీమిండియా మానసికంగా శారీరకంగా అద్భుతం గా తయారవడానికి ఉపయోగపడ్డాయి.

ప్రపంచ కప్ మనదే!!

                     
ఇప్పుడున్న టీమ్ ఇండియాను  చూస్తుంటే ఏ సగటు భారత క్రికెట్ అభిమాని అయిన 2019 లో జరగబోయే వన్డే ప్రపంచకప్ కచ్చితంగా మనదే అని అంటాడు. ఎందుకంటే అటు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. అప్పుడేప్పుడో 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ సాధించి సచిన్ కు చిరస్మరణీయమైన గిఫ్ట్ ను అందించింది మళ్లీ ఆ తర్వాత నుంచి మనవాళ్లు వన్డే ప్రపంచకప్ ను గెలువలేకపోయారు. అయితే ఈసారి కెప్టెన్ కూల్ ధోనీ కూడా త్వరలో వన్డేల నుంచి రిటైర్ అవుతాడు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో
టీమిండియా ఈసారి మళ్లీ వన్డే ప్రపంచ కప్ గెలిచి ఈసారి ధోనికి గిఫ్ట్ గా ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

నరేంద్ర మోడీ బయోపిక్ ఫస్ట్ లుక్

Mon Jan 7 , 2019
నరేంద్ర మోడీ బయోపిక్ ఫస్ట్ లుక్         Image credited from Twitter.com భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ను హిందీ లో సినిమాగా తీస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ బయోపిక్ లో నరేంద్ర మోడీ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. నటుడు వివేక్ ఒబెరాయ్ అచ్చంగా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: