క్రిష్ కంగనల మధ్య మణికర్ణిక వివాదం

క్రిష్ కంగనల  మధ్య మణికర్ణిక వివాదం

మణికర్ణిక క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ హీరోయిన్ల మధ్య ఒక వివాదం నడుస్తోంది. ఈ సినిమా మొదలు అయినప్పుడు దీనికి క్రిష్ డైరెక్టర్ గా కంగనా రనౌత్ హీరోయిన్ గా ప్రారంభించారు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ క్రిష్ బయటకు వచ్చి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను ప్రారంభించారు. అయితే అప్పటికే మణికర్ణిక సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో దానిని హీరోయిన్ కంగనా రనౌత్ తానే దర్శకత్వం వహిస్తూ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయించారు అయితే ఎప్పుడైతే క్రిష్ ఈ సినిమా నుంచి బయటకు వచ్చారో ఆ రోజు నుంచి తనకి ఈ సినిమాకి ఇవ్వవలసిన క్రెడిట్ ఇవ్వకుండా కంగన అడ్డుకుంటూ వచ్చింది అని క్రిష్ ఆరోపణలు చేస్తున్నారు ఈ మధ్య ఆయన ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముందుగా టీజర్లో కంగనా తన పేరును క్రిష్ గా కాకుండా జాగర్లమూడి రాధాకృష్ణ అని వేయించింది అని ఆ తర్వాత మెల్లగా దర్శకత్వం క్రెడిట్ ముందుగా తన పేరు వేసుకుని ఆ తర్వాత ఆయన పేరు వేసిందని చెప్పుకొచ్చారు. సోనూసూద్ గురించి జరిగిన వ్యవహారంలో తాను కంగనా కి మద్దతు తెలుపకపోవడంతో ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావా అని ఆయన డైరెక్ట్ గా కంగనాని వాట్సాప్ చాట్ లో అడిగారంట కంగనా అప్పుడు కూడా లేదు ప్రొడ్యూసర్లు నన్నే డైరెక్ట్ చేయమంటున్నారు అని క్రిష్ గారి తో చెప్పిందట. 
అయితే ఈ సినిమా వివాదం ఇలా జరుగుతూ ఉండగానే మణికర్ణిక సినిమా రిలీజ్ అవ్వడం ఆ సినిమాలో కూడా కంగనా ముందుగా తన పేరు వేసుకుని ఆ తర్వాత క్రిష్ పేరు వేయడం బాగా చర్చనీయాంశం అయ్యాయి. డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ విషయంలో క్రిష్ కి అందరూ మద్దతు తెలపాలని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అయితే కంగనా రనౌత్ చెల్లెలు ట్విట్టర్ లో కొన్ని వాట్స్అప్ చాట్ లను షేర్ చేస్తూ డైరెక్టర్ క్రిష్ దే తప్పు అన్నట్లుగా ఈ రోజు కొన్ని ట్వీట్స్ చేసింది. దానికి ప్రతిగా డైరెక్టర్ క్రిష్ కూడా తనతో కొంతమంది షేర్ చేసుకున్న వాట్సాప్ మెసేజ్ లను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఒకవైపు సినిమా రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల ను బాగానే రాబడుతున్నప్పటికి ఈ సినిమా మీద జరుగుతున్న ఈ వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.

కంగనా చెల్లెలు షేర్ చేసిన వాట్సాప్ చాట్

డైరెక్టర్ క్రిష్ షేర్ చేసిన వాట్సాప్ చాట్

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నాగ చైతన్య తో అనుకున్న సినిమా రాజ్ తరుణ్ తో అంట

Sun Feb 3 , 2019
నాగ చైతన్య తో అనుకున్న సినిమా రాజ్ తరుణ్ తో అంట దిల్ రాజు నిర్మాత గా నాగ చైతన్య తో ఒక సినిమాను ప్లాన్ చేశారు మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తీయలనుకున్నారు ఒక కొత్త దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి ఆ స్టోరీ నీ డెవలప్ చేయించి మరీ రాజు గారు ఈ కథను నాగ చైతన్య కు చెప్పించారు అయితే ఏం అయ్యింది అనేది […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: