క్రిష్ పై కంగనా తీవ్ర విమర్శలు!!


Kangana in Manikarnika

డైరెక్టర్ క్రిష్ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు ‘ఎన్టీఆర్ బయో పిక్’ పైకి వెళ్లింది. మణికర్ణిక సినిమాను అర్ధాంతరంగా వదులుకుని.. ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించేoదుకు వచ్చిన క్రిష్ ఇటీవల మణికర్ణిక సినిమా రిలీజ్ అయిన తర్వాత కంగనా రనౌత్ మీద తీవ్రంగా స్పందించాడు. మొదట్లోనేమో.. ‘మణికర్ణిక’ దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం విషయంలో కంగనా తనకు ఫోన్ చేసి వివరాలను చెప్పిందని క్రిష్ అన్నాడు. తీరా ఆ సినిమా విడుదల సమయంలో దాని దర్శకత్వ క్రెడిట్ తనదే అని అన్నాడు.

కంగనా తీరును క్రిష్ తీవ్రంగా దుయ్యబట్టాడు. సినిమా అంత బాగా రాలేదని తనను సినిమా సరిగా తీయనీయ లేదని క్వాలిటీ కనిపించలేదని కథా పరంగా కూడా కంగనా నే చాలా మార్పులు కేవలం ఆమె కోసమే చేయించింది అని ఇలా చాలా ఆరోపణలు చేశాడు. అయితే క్రిష్ చేసిన ప్రతి ఆరోపణను కంగనా రనౌత్ తిప్పి కొట్టింది. ఇన్ని వివాదాలకు కారణం అయిన ‘మణికర్ణిక’ రిలీజ్ అయ్యి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్లు అయితే 70 కోట్ల వరకూ వచ్చాయి. కొంత మంది సినిమాను పొగిడారు కూడా కానీ.. ఝాన్సీ రాణి కథ అంతకంటే గొప్పగా చెప్పవచ్చని బాలీవుడ్ రివ్యూయర్లు అన్నారు. మణికర్ణికలో అసలు సోల్ మిస్ అయ్యిందని విశ్లేషించారు.

Kangana AS Jhansi Rani


తన సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా కంగనా పెద్దగా పట్టించుకోలేదు. అయితే క్రిష్ మాత్రం సినిమా రిలీజ్ అప్పుడు ఆ తర్వాత కంగనా రనౌత్ నీ తీవ్రంగా విమర్శించాడు ‘ఇకపై ఆమెతో ఎవరు పనిచేస్తారో చూస్తా…’ అంటూ క్రిష్ వ్యాఖ్యానించాడు. అలా మాట్లాడిన క్రిష్ పై ఇప్పుడు కంగనా కౌంటర్ ఇచ్చింది అది కూడా అనుకోకుండా కంగనా కు ‘ఎన్టీఆర్ మహానాయకుడు ‘ రూపంలో దొరికింది. ఆ సినిమాకు మొదటి రోజు నుంచి అసలు కలెక్షన్స్ లేకపోవడంతో దాదాపు మేకర్స్ పరుపు పోయినంత పనైంది. ఇక్కడే కంగనా క్రిష్ మీద విరుచుకుపడింది. కంగనా ” బయోపిక్ ఫ్లాప్ అయ్యిందని విన్నాను. డిస్ట్రిబ్యూటర్లకు తీవ్రమైన నష్టాలు సంభవించాయట. జీరో రికవరీ అంటున్నారు. ఆ నటుడి కెరీర్ మీదే ఆ సినిమా ఒక బ్లాక్ మార్క్ బాలకృష్ణ గారికి నా సానుభూతి. క్రిష్ ను నమ్మి భారీగా వెచ్చించారు. మణికర్ణిక విషయంలో క్రిష్ కొన్ని పెయిడ్ మీడియా వర్గాలు నాపై దాడిచేశారు. ఆ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఒక స్వతంత్ర యోధురాలిపై తీసిన సినిమాను దెబ్బతీయడానికి ప్రయత్నించిన సిగ్గులేనివాళ్లు వాళ్లంతా..’ అంటూ క్రిష్ మీద తీవ్రంగానే స్పందించింది కంగనా.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

సినిమా రిలీజ్ అవకముందే సీక్వెల్ అనౌన్స్ చేశారు

Mon Feb 25 , 2019
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది దాని పేరు ఇస్మర్ట్ శంకర్ ఈ సినిమాలో రామ్ మొదటిసారి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించ బోతున్నాడు. హీరో క్యారెక్టర్, సినిమా అంతా పూరి స్టైల్ లో చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఈ సినిమా వర్గాలు చెబుతున్నాయి. రామ్ కు జోడీగా నన్ను దోచుకుందువటే సినిమా ఫేమ్ న భా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: