ఖబడ్దార్ అంటూ BJP వార్నింగ్ – నితిన్ సినిమాపై రాజకీయ వివాదం..

ఖబడ్దార్ అంటూ BJP వార్నింగ్ – నితిన్ సినిమాపై రాజకీయ వివాదం..

నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమా భారీ అంచనాల మధ్య ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వెంకీ తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై వివాదం కూడా ముంచుకొస్తుంది. ఈ సినిమాను ఎలాగైనా విడుదల కాకుండా అడ్డకుంటామంటూ బీజేపీ ధార్మిక సెల్ వార్నింగ్ ఇచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 21న దాదాపు 800 స్క్రీన్స్‌లో విడుదల కానుంది ఈ చిత్రం. అన్నీ సవ్యంగా సాగుతున్న సమయంలో భీష్మ సినిమాపై లేనిపోని వివాదాలు వచ్చాయి. 
నితిన్ సినిమాపై రాజకీయ వివాదం.. ఖబడ్దార్ అంటూ BJP వార్నింగ్..
ఈ విషయంపై బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ తూములూరి శ్రీ కృష్ణ చైతన్య, ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము దర్శక నిర్మాతలను టైటిల్ మార్చాలంటూ డిమాండ్ చేసారు. టైటిల్ మార్చకుంటే సినిమాను అడ్డుకుంటామని కోర్టును కూడా వెళ్తామని బీజేపీ ధార్మిక సెల్ హెచ్చరించింది. గతేడాది వాల్మీకి సినిమా విషయంలో కూడా కొందరు ఇలాగే రచ్చ చేస్తే.. చివరికి దానికి గద్ధలకొండ గణేష్ అని టైటిల్ మార్చేసాడు హరీష్ శంకర్. రేపు విడుదలవుతుందనగా రాత్రికి రాత్రే కొత్త పోస్టర్స్ ప్రింట్ చేసారు. మరి ఇప్పుడు భీష్మ సినిమాకు ఎలాంటి కష్టాలు వస్తాయో చూడాలిక.
భీష్మ సినిమాకు వార్నింగ్ ఇచ్చిన BJP (bheeshma movie)
ఈ సినిమాకు టైటిలే కష్టాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. మహాభారతంలోని భీష్ముడి పేరుని సినిమా టైటిల్‌గా పెట్టడంతో అసలు తలనొప్పులు మొదలయ్యాయి. ఈ టైటిల్‌తో హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని బీజేపీ ధార్మిక సెల్ ఆవేదనను వ్యక్తం చేసింది. వెంటనే టైటిల్ మార్చాలని.. లేదంటే సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు వాళ్లు. సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనే విడుదల కానిచ్చేది లేదంటూ వాళ్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు…
భీష్మ సినిమాకు వార్నింగ్ ఇచ్చిన BJP (bheeshma movie)
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

#Kannumkannumkollaiyadithaal - #Kannumkannumkollaiyadithaal

Sun Feb 23 , 2020
#Kannumkannumkollaiyadithaal  #Kannumkannumkollaiyadithaal  Romantic comedy #Kannumkannumkollaiyadithaal all set to hit the screens on Feb 28. #KKKFromFeb28 @dulQuer @riturv @RakshanVJ @Niranjani_Nini @Viacom18Studios @AndhareAjit @desingh_dp @IamAntoJoseph https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: