గల్లి బాయ్ రీమేక్ లో సాయి ధరమ్ తేజ్


మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్,  హిందీ సినిమా గల్లీ బాయ్ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా హిందీలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది రన్వీర్ సింగ్,అలియాభట్ హీరోహీరోయిన్లుగా జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టిస్తుంది. ర్యాప్ సింగింగ్ కథా నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది ముంబై స్లమ్ వీధుల్లో ఉండే ఒక సాధారణ యువకుడు ర్యాప్ సింగింగ్ ప్రపంచంలో ఏలా ఒక గొప్ప సింగర్ గా ఎదిగాడు అనేది ఈ చిత్ర కథ.

saidharam tej as Gullyboy
 అయితే ఇప్పుడు దీనిని తెలుగులో హీరో సాయి ధరమ్ తేజ్ తో రీమేక్ చేయాలని గీతా అధినేత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు అని టాక్ నడుస్తుంది ఇప్పటికే ఇంటెలిజెంట్ ,      తేజ్ ఐ లవ్ యు లాంటి భారీ ఫ్లాప్ సినిమాలతో సాయి ధరంతేజ్ చాలా ఒడిదుడుకులతో ఉంది ఇప్పుడు అతను రీసెంట్ గా చేస్తున్న చిత్రలహరి సినిమా మీద కూడా అంతగా హోప్స్ ఏమీ లేవు కానీ ఆ సినిమా ఇంకా విడుదల అవలేదు. ఈలోగా సాయి ధరంతేజ్ కెరీర్ నీ ఒక గాడిన పెట్టాలని మెగా ఫ్యామిలీ ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

gullyboy ranveer alia
సాయి ధరంతేజ్ తన మొదటి సినిమా నుంచి డాన్సులు, ఫైట్స్  బాగా చేస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు, సాయి ధరంతేజ్ బాడీలో మంచి ఈజ్ వుంటుంది ఎలాంటి మోమెంట్ అయినా చాలా ఈజీగా చేయగలడు గల్లీ బాయ్ సినిమా కూడా డాన్స్ మ్యూజిక్ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి సినిమా అతనికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పొచ్చు.   గల్లి భాయ్ సినిమా రీమేక్ రైట్స్ ఇంకా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్  తీసుకున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ అన్నీ కుదిరి ఈ రీమేక్ గనుక సాయి ధరంతేజ్ ఉన్నట్లయితే మరి ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

నాని సుధీర్ బాబు హీరోలుగా భారీ మల్టీ స్టారర్ మూవీ

Tue Feb 19 , 2019
నాని సుధీర్ బాబు హీరోలుగా భారీ మల్టీ స్టారర్ మూవీ నేచురల్ స్టార్ నాని సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోతుంది దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవరిస్తున్నారు. మోహన్ కృష్ణ సమ్మోహనం సినిమా తర్వాత నాని ఇంకో హీరోతో కలిపి ఓ  మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశారు అయితే నాని మొదట ఆ కథ కు ఒప్పుకున్నాడు కానీ నానికి […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: