Read Time:8 Minute, 10 Second
గెలుపు గుర్రాలు ఏవి???
ఈ శుక్రవారం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే చివరికి బాక్సాఫీసు దగ్గర ఏ సినిమా విజేతగా నిలుస్తుందని చూడాలంటే మనం ఇంకొక్క 24 గంటల వరకు ఆగాల్సిందే.
ఇక పోతే ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది
కే జీ ఎఫ్ అనే సినిమా గురించి. ఇది కన్నడ భాషలో నిర్మితమైన సినిమా. అయినా ఈ మధ్యకాలంలో బాహుబలి సినిమా తర్వాత ఇటు సౌత్ ఇండియా లోనూ అటు నార్త్ ఇండియా లోనూ మళ్లీ ఆ రేంజ్ లో బాగా పబ్లిసిటీ సంపాదించుకున్న చిత్రమిది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కి 100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు అని అనుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ లో, టీజర్స్ లో ఉన్న విజువల్స్ ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచే సాయి. ఈ నెల 21వ తారీకు న ఈ సినిమా ఒకేసారి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజవుతుండడం విశేషం. ఈ సినిమాకు ఏమాత్రం టాక్ బాగుందని వచ్చిన కలెక్షన్ల విషయంలో కూడా దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తుంది.
మరొక సినిమా గురించి మాట్లాడుకుంటే యూత్ హీరో శర్వానంద్, యూత్ సెన్సేషన్ సాయి పల్లవి ఇద్దరూ జంటగా నటిస్తున్న పడి పడి లేచే మనసు గురించి మనం మాట్లాడుకోవాలి. తెలుగులో ఫిదా, ఎంసిఏ లాంటి సినిమాలు తర్వాత సాయి పల్లవి చేస్తున్న మూడో చిత్రమిది,మహానుభావుడు లాంటి మంచి హిట్ ఇచ్చిన తర్వాత శర్వానంద్ చేస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి కి మాత్రం లై లాంటి ఒక అతి భారీ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ సినిమా ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ అన్న మెసేజ్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్ళింది. ఇక కచ్చితంగా యూత్ లో చాలా మంది ఈ సినిమా చూడటానికి ఇష్టపడతారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు యూత్ లో మంచి ఆదరణ తెచ్చుకున్నాయి.
దర్శకుడు హను రాఘవపూడి లవ్ స్టోరీస్ ని బాగా డీల్ చేస్తారు అని ఆయనకు మంచి పేరుంది. తను గతంలో తీసిన అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలతో ఆ విషయాన్ని అతను చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందా లేదా అన్నది ఎదురు చూడాల్సిన విషయం. అయితే ఈ సినిమా ఒక కొరియన్ సినిమాకి కాపీ అన్న విమర్శలు కూడా వచ్చాయి. హీరో, హీరోయిన్ ని ప్రేమించడం ఆ తర్వాత హీరోయిన్ కి జరిగిన ప్రమాదం వల్ల ఆమె తన గతం మరచిపోవడం అన్నది సినిమా ప్రధాన కథగా తెలుస్తుంది. అయితే ఇదే కథతో ఇంతకుముందు తెలుగులో తేజ లవ్ యు రీసెంట్ గా అనగనగా ఒక ప్రేమకథ అనే సినిమాలు వచ్చాయి ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా ఇదే కథతో ఉండడం విశేషం. ఈ మూడు సినిమాలన్నింటికీ మూలకథ గా చెబుతున్న కొరియన్ సినిమా ని కాపీ కొట్టే సందరు దర్శకులు ఈ కథలను తయారు చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ నటంచిన తేజ్ ఐ లవ్ యు అనే సినిమా, అనగనగా ఒక ప్రేమకథ అనే ఒక చిన్న సినిమా రెండు విడుదలై ఫ్లాప్ అవడం జరిగింది. మరి ఇప్పుడు పడి పడి లేచే మనసు విషయంలో కూడా ఏం జరుగుతుందో అని సినీ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మరొక సినిమా అంతరిక్షం, ఘాజీ లాంటి ఒక వైవిధ్యమైన సినిమా తర్వాత ఆ దర్శకుడు నుంచి వస్తున్న చిత్రం కూడా ఇదే. తెలుగు లో ఇంత వరకు ఎవ్వరు పూర్తి స్పేస్ సినిమా చేయలేదని మొదటి తెలుగు స్పేస్ సినిమా తమదేనని ఈ చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంది. సినిమాలో కనిపిస్తున్న విజువల్స్, మూడ్ కానీ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతున్నాయి. తెలుగులో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాటి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. కొత్త చిత్రాలు ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని కూడా ఆదరిస్తారని ఈ చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఇకపోతే చివరి సినిమా మారి2 తమిళ్ హీరో ధనుష్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి బాలాజీ మోహన్ దర్శకుడు. గతంలో ఇదే పేరుతో ధనుష్ హీరోగా ఇంతకుముందు వచ్చిన సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తీస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్స్ ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్ టైన్ మెంట్ సినిమా అని చెబుతున్నాయి, తమిళ్ లో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి తెలుగు లో ఒక్క రఘువరన్ బీటెక్ అనే సినిమాతో తప్ప ఇంకా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ధనుష్ ఈ సినిమాతో ఈ మేరకు ఆకట్టుకుంటాడో చూడాల్సిందే.
ఏమైనా ఈ వారం రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు హిట్ అవ్వాలని సదరు నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలని తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ
కళకళలాడుతూ ఉండాలని సినిమారాస్కెల్స్ టీం కోరుకుంటుంది.
కళకళలాడుతూ ఉండాలని సినిమారాస్కెల్స్ టీం కోరుకుంటుంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss