గ్రీనరీ లో అనుపమ
ప్రస్తుతం అనుపమకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో తమిళ, మలయాళ ఇండస్ట్రీలపై కన్నేసింది. అది అలా ఉంటే.. అనుపమ ప్రస్తుతం ప్రకృతిని తెగ ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోస్‌ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ ఫోటోస్‌ను చూసి ఆమె అభిమానులు, నెటిజన్స్ ఫిదా అవుతూ.. వావ్ అనుపమా సూపర్ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అనుపమ పరమేశ్వరన్ : ఈ కేరళ కుట్టి.. ‘ప్రేమమ్’ అనే సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా కేరళలో సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు తెలుగులో నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అ ఆ’లో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో గడుసు పిల్లగా అనుపమ అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ భామ. ఇటు నటిస్తూనే.. అనుపమ ఓ మలయాళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తోంది. ఈ సినిమాను ‘మహానటి’ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నాడు. అనుపమ తాజాగా తెలుగులో నటించిన సినిమా ‘రాక్షసుడు’. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్‌ను అందుకుంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss