చంద్రబాబు ఆవేశానికి అసలు కారణం అదేనా??

చంద్రబాబు ఆవేశానికి అసలు కారణం అదేనా??

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  గారికి ఈమధ్య ఎక్కడలేని ఆవేశం వస్తుంది మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీద ఆయన చూపించిన ఆవేశం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏప్పుడు సైలెంట్ గా సీరియస్ గా ఉండే చంద్రబాబు నాయుడు ఇంత ఆవేశానికి లోను అవడం ఏంటి అని రాజకీయ విశ్లేషకులు కూడా కామెంట్ చేశారు. ఏప్పుడైతే బిజెపి తెలుగుదేశం పార్టీల మధ్య దూరం పెరిగి పరస్పరం ఇరువురు తిట్టుకోవడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలాంటి సమయంలో అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు పైన ప్రత్యేక హోదా గురించి విమర్శలు చేయడం బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ కు చాలా చేసింది అని మాట్లాడటం చంద్రబాబు నాయుడు కి ఎక్కడ లేని కోపం తెప్పించింది ఎప్పుడు తాను సీనియర్ పొలిటిషన్ అని జెంటిల్ మెన్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇక బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీద రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల కెరీర్లో ఆయన ఇంతగా ఒక ఎమ్మెల్యే మీద విరుచుకు పడటం ఇదే మొదటిసారి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో అక్కడ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరగబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ మీద ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తమ పార్టీకి ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రత్యేక హోదా విషయం గురించి బిజెపి ఎమ్మెల్యే మీద చంద్రబాబు నాయుడు ఈ విధంగా విరుచుకుపడ్డారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న రెండు జాతీయ న్యూస్ ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ లో చేసిన సర్వే లో ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారని ఆ పార్టీకి ఏకంగా 23 ఎంపీ సీట్లు రాబోతున్నాయి అని తేల్చి చెప్పడంతో ఈ సర్వే అటు తెలుగుదేశం పార్టీ మీద అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా రాజకీయ పార్టీల మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపించింది. ఎలాగైనా మళ్లీ గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇలాంటి సర్వేలు నిజంగానే మింగుడు పడటం లేదు అటుపక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అధికారంలోకి రావాలని లేకపోతే తనకు తన పార్టీకి అసలు ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి తన పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇప్పటికే నవరత్నాలు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని పథకాలను అనౌన్స్ చేశారు. ఇంకో వైపు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు గా ఉన్న నాయకులు అలాగే టికెట్ రాదేమో అన్న సందేహంతో కొట్టు పడుతున్న తటస్తులను తన పార్టీలోకి తీసుకు రావడానికి ఆపరేషన్ ఆకర్ష్ ను కూడా ప్రారంభించారు. మరో పక్క చంద్రబాబు నాయుడు మాజీ స్నేహితుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అని ఎట్టి పరిస్థితుల్లో సంచలనం సృష్టించి ఆంధ్రప్రదేశ్లో తన పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. క్రితం సారి జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతుతో చివరి నిమిషంలో గండం గట్టెక్కి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కలో బల్లెంలా తయారయ్యారు ఒకవైపు ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక ఓటును పవన్ కళ్యాణ్ చీలుస్తారు అని లోలోన సంతోష పడుతున్న మరోవైపు ఇన్ని సంవత్సరాలుగా తమకు అండగా ఉన్న ఒక బలమైన సామాజిక వర్గం  పవన్ కళ్యాణ్ కి సారి తమ మద్దతు ప్రకటిస్తే తన పరిస్థితి ఏంటి అన్న డైలమాలో కూడా ఉన్నారు. అయితే జనసేన పార్టీ కి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన అభ్యర్థులు ఇంకా దొరకలేదు అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం ఇటువైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైకి ఎంత బలంగా కనిపిస్తున్నప్పటికీ అటు రాయలసీమలో ఇటు కోస్తాంధ్రలో  కొన్ని చోట్ల ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు కూడా కరువయ్యారు ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత పటిష్టంగా ఉన్న పార్టీ ఒక టిడిపినే అన్నది జగమెరిగిన సత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా బలం ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో అసలు దాని చాయలు కూడా కనిపించడం లేదు గడచిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలాగే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించిన ఎమ్మెల్యే సీట్లను చూస్తే ఎవరైనా ఈ నిజాన్ని ఒప్పుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఇటు బిజెపి పార్టీ మీద తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ఇన్ని రోజులు మేము బీజేపీతో కలిసి ఉన్నా కూడా ఇప్పుడు బీజేపీ మీద పోరాడుతున్నాం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నారన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు విపరీతంగా శ్రమిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇంకో మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మళ్ళీ యుద్ధానికి సమరభేరి నిర్వహిస్తూ తమ ప్రత్యర్థులను ఇలా చేయాలని ఇప్పటికే కదన రంగం లోకి దూకేసాయి వచ్చే 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలిచే పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే మరి కొన్ని నెలలు ఎదురుచూడక తప్పదు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారా??

Sun Feb 3 , 2019
రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారా?? మొన్నటికి మొన్న నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ ఆయన తండ్రి గారి మీద తీసిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయింది ఇదే ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు మరి ఒకసారి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర వెండి తెర మీదకి రాబోతుంది మరెవరి సినిమాలో కాదు దర్శకుడు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: